సినిమా

Sai Pallavi: సాయి పల్లవి కాళ్ళు మొక్కిన డైలాగ్ కోచ్..!

4 నిమిషాల పఠనం

Sai Pallavi: హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ చేసే కొన్ని పాత్రలకి ప్రేక్షకులు, అభిమానులు..చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. కొన్ని వేశాధారణలలో నటీనటులను చూసినప్పుడు కాళ్ళకి నమస్కరించాలనే తన్మయత్వం కలుగుతుంది. అలాంటి, తన్మయత్వంలో సాయి పల్లవి కాళ్ళకి నమస్కరించింది ఓ డైలాగ్ కోచ్. అది, రామాయణ సినిమా షూటింగ్ అమయంలో. అప్పుడు సాయి పల్లవి సీత గెటప్‌లో ఉంది.

ఇటీవల, అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రామాయణ. రామాయణ ఇతిహాసం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా నుంచి మొదటి భాగం రిలీజై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ..ఇప్పటికే 1000 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టింది. ఇంకా, ఈ సినిమాకి అన్నీచోట్ల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

రణ్‌బీర్ కపూర్ ఇందులో శ్రీరాముడిగా, టాలీవుడ్ ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణ్ పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. కాజల్ పాత్ర మండోదరి మాత్రమే స్క్రీన్ మీద ఆశించిన స్థాయిలో నిడివి లేకపోవడం మైనస్ తప్ప, శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్ సహా దాదాపు అందరికీ మంచి ఆదరణ దక్కుతోంది. దీనితో, 2027 దీపావళికి రావాల్సిన రామాయణ రెండవ భాగం మీద ఇప్పట్నుంచే అంచనాలు పెరిగాయి.

అయితే, సాయి పల్లవికి హిందీ భాష రాదు కాబట్టి, అక్కడ తన కోసం ప్రత్యేకంగా ఓ డైలాగ్ కోచ్‌ను చిత్రబృందం ఏర్పాటు చేసింది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె సాయి పల్లవితోనే ట్రావెల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరోజు సీత పాత్రలో కనిపించిన సాయి పల్లవికి ఆమె ఉన్నపలంగా కాళ్ళకి నమస్కారం చేసి షాకిచ్చిందట. ఇలా, ఎందుకు చేశావని సాయి పల్లవి అడగగానే, నేను మీకు కాదు..సీతకి నమస్కరించానని ఎంతో ఎమోషనల్‌గా సమాధానమిచ్చిందట. ఆ క్షణం సాయి పల్లవి కళ్ళలో నీళ్ళు తిరిగాయని ఆ మధుర క్షణాల గురించి చెప్పుకొచ్చింది. నిజంగా, ఇది అదృష్టమే అని చెప్పాలి.

#Ramayana#Sai Pallavi#Sita#Ranbeer Kapoor#Nithish Tiwari
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి