తెలంగాణ

SBI : ఎస్‌బీఐ స్టాఫ్ చేతివాటం? బ్యాంక్ లాకర్‌లో బంగారం మాయం?

6 నిమిషాల పఠనం

ఆలేరు‌లోని ఓ ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్ ఆఫీసులోని లాకర్‌లో బంగారు నగలు మాయం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 తులాలు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో బంగారం పొగొట్టుకున్న వారు వృద్ధదంపతులు. నగలు డిపాజిట్ చేశాక చాలా కాలం తర్వాత రెండు సార్లు మాత్రమే బ్యాంకు వెళ్లి నగలు చూసుకున్నామని చెబుతున్నారు.

ఆలేరు‌లోని ఓ ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్ ఆఫీసులోని లాకర్‌లో బంగారు నగలు మాయం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 తులాలు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో బంగారం పొగొట్టుకున్న వారు వృద్ధదంపతులు. నగలు డిపాజిట్ చేశాక చాలా కాలం తర్వాత రెండు సార్లు మాత్రమే బ్యాంకు వెళ్లి నగలు చూసుకున్నామని చెబుతున్నారు. కానీ, బ్రాంచ్ ఆఫీసులో నగలు మాయం కావడం.. రికార్డులు సరిగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

లాకర్ నంబర్, డిపాజిట్ వివరాలు..

ఆలేరు మండలం గుండ్లగూడెంకు చెందిన అంగిరేకుల కృష్ణమూర్తి, లక్ష్మీబాయి దంపతులు 2013లో లాకర్ (నం.ఎ1/12/ ఎస్‌బీఐ-ఆలేరు) సౌకర్యం పొందారు. 22.5.2013వ తేదీన 18 తులాల బంగారు నగలు లాకర్‌లో భద్రపరించారు. అనంతరం 24.12.2018న లాకర్‌ను తెరిచినట్లు బ్యాంకు రికార్డుల్లో నమోదు అయి ఉంది.

బ్యాంకులో ఆడిట్..నగలు మాయం..

గత 5 రోజులుగా ఎస్‌బీఐ బ్యాంకులో ఆడిట్ జరుగుతోంది. అధికారులు ఈనెల 10న లాకర్లను పరిశీలిస్తుండగా.. ఎ1/12 నంబరు లాకర్ తాళం వేయకుండా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాలతో బ్యాంకు అధికారులు లాకర్ ఎవరైతే తీసుకున్నారో వారికి కాల్ చేసి బ్యాంకుకు రావాలని సూచించారు. ఈ నెల 12న లక్ష్మీబాయి బ్యాంకుకు రాగా నిబంధనల మేరకు సంతకాలు తీసుకుని లాకర్‌ను చూపించారు.అయితే, లాకర్‌లో నగలు లేవు.

SBI : ఎస్‌బీఐ స్టాఫ్ చేతివాటం? బ్యాంక్ లాకర్‌లో బంగారం మాయం?

2023లో ఒకసారి లాకర్ వద్దకొచ్చి నగలు చూసుకున్నామని బాధితులు పేర్కొన్నారు. బ్యాంకు రికార్డుల్లో మాత్రం వారు వచ్చిన తేదీన ఎటువంటి రికార్డులు లేవు. అధికారులు మాత్రం 2018లోనే లాకర్ వద్దకు వచ్చారని, అందుకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని చూపిస్తున్నారు. కానీ, బాధితులు మాత్రం తాము 2023లో కూడా లాకర్ వద్దకు వచ్చామని చెబుతున్నారు. బాధితులకు సంతకం లేకపోవడం, ప్రస్తుతం వారు 80 ఏళ్లకు పైబడిన వయసులో ఉన్నారు.మూడేండ్ల క్రితం బాధితులు నిజంగానే బ్యాంకు వస్తే నగలు తీసుకుంటే విత్ డ్రా చేసినట్టు వివరాలు ఉండాలి కదా? లాకర్ క్లోజ్ చేయాలి కదా? ఎందుకు చేయలేదు?

ఇంకా లాకర్ కోసం వారి అకౌంట్ నుంచి డబ్బులు ఎలా ఆటో డెబిట్ అవుతున్నాయి? ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బంది మరిచారా? సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా? వారు వచ్చారో లేదో చెక్ చేస్తే తెలుస్తుంది కదా? నిజంగా వారు వస్తే బంగారు తీసుకెళ్లేది కూడా రికార్డు అయ్యి ఉంటుంది కదా? ఒకవేళ వారు వచ్చి బంగారాన్ని చూసుకుని ఖాళీ చేతులతో వెళితే అది కూడా తెలుస్తుంది కదా? అప్పుడు లాకర్ లోని బంగారం మాయం వెనుక ఎవరు ఉన్నారు? అని పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

వారసులు లేని వారే టార్గెట్?

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్ఐబీ బ్యాంకు లాకర్‌లోని బంగారం మాయం వెనుక కుట్రకోణం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు వారసులు లేరని సమాచారం. అందుకే వారి నుంచి పూర్తి వివరాలు సేకరించాక బ్యాంకులోని సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు టాక్ వినిపిస్తోంది. వృద్ధులను బురిడీ కొట్టించి లాకర్ లోని 18తులాల బంగారం మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇంకెన్ని దారుణాలు జరిగాయో అని కూడా ప్రచారం జరుగుతోంది.

బ్యాంకు వారిది ఎలాంటి మిస్టేక్ లేకపోతే రికార్డులు ఎందుకు మిస్ అవుతాయి? లాకర్‌ క్లోజ్ చేసి ఉండాలి, ఎలా తెరుచుకుని ఉంది? వృద్ధులు తామంతట తామే వచ్చి బ్యాంకు లాకర్ ఓపెన్ చేసి బంగారం తీసుకెళ్తారా? అదే జరిగితే సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి?లీగల్‌గా విత్ డ్రా చేస్తే లాకర్ ఎందుకు క్లోజ్ చేయలేదు? అని కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆడిటింగ్ లేకపోతే ఈ విషయం ఇప్పుడు కూడా బయట పడకపోయేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుని వృద్ధులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మేనేజర్ వివరణ

"లాకర్‌లో నగలు లేవనే విషయాన్ని బాధితులకు ఫిర్యాదు పత్రం అందజేశాం.ఈ విషయాన్ని శాఖాపరంగా ఉన్నతాధికారులకు తెలియజేశామని" ఆలేరు బ్యాంకు మేనేజర్ వెల్లడించారు.

#18 tulas gold missing#sbi bank#locker#aleru#victims#oldage people#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి