తెలంగాణ

మహిళా భద్రత, డయల్ 100 వ్యవస్థ మెరుగుపై ప్రత్యేక దృష్టి: నూతన సీపీ మహేశ్ భగవత్!

6 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ నగర కొత్త పోలీస్‌ కమిషనర్‌గా (కొత్వాల్‌) నిష్ణాతులైన సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన మహేశ్‌ భగవత్‌కు నగర పోలీసింగ్‌పై అపారమైన అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇప్పుడు భాగ్యనగర పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్‌ నగర కొత్త పోలీస్‌ కమిషనర్‌గా (కొత్వాల్‌) నిష్ణాతులైన సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన మహేశ్‌ భగవత్‌కు నగర పోలీసింగ్‌పై అపారమైన అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇప్పుడు భాగ్యనగర పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే అత్యవసర సేవలందించే 'డయల్ 100' రెస్పాన్స్ వ్యవస్థను మరింత వేగవంతం చేసి మెరుగుపరుస్తామని తెలిపారు.

 నగరంలో విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ పేర్కొన్నారు. భూ వివాదాలు, సెటిల్‌మెంట్ల పేరిట దాడులకు పాల్పడే వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో సీపీలుగా పనిచేసిన సీవీ ఆనంద్, సజ్జనార్‌లు ప్రారంభించిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూనే, ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. నగరంలోని అనుభవజ్ఞులైన అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు.

 పోలీస్ శాఖలో నేర నియంత్రణతో పాటు సామాజిక బాధ్యతలోనూ మహేశ్ భగవత్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా నిరోధంలో ఆయన చేసిన సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2004 నుంచి 2022 మధ్య కాలంలో దాదాపు 2 వేలకు పైగా మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా ముఠాల చెర నుంచి విడిపించారు. సుమారు 200 వ్యభిచార కేంద్రాలను మూసివేయించడంతో పాటు, ఇటుక బట్టీలు, ప్రమాదకర పరిశ్రమల్లో మగ్గుతున్న 7 వేల మందికి పైగా బాల, వెట్టి కార్మికులకు విముక్తి కల్పించారు.

 ఆదిలాబాద్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన చేపట్టిన 'పోలీస్‌ మీకోసం' కార్యక్రమానికి 2004లో అమెరికా ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చీఫ్స్‌ ఆఫ్‌ పోలీస్‌ నుంచి అవార్డు లభించింది. అలాగే నల్గొండలో మానవ అక్రమ రవాణా బాధితుల రక్షణ కోసం చేపట్టిన 'ఆసరా' ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2017లో అమెరికా విదేశాంగ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే 'ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సన్స్‌ రిపోర్ట్‌ హీరో' (TIP Report Hero) అవార్డును ఆయన అందుకున్నారు. 2025లో డీవై పాటిల్ విద్యాపీఠ్ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇవే కాకుండా రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీస్‌ మెడల్, మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్, విశిష్ఠ సేవా పతకం వంటి అనేక పురస్కారాలు ఆయన సేవలకు నిదర్శనంగా నిలిచాయి.

 కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు గైడ్‌గానూ మహేశ్ భగవత్ విశేష సేవలందిస్తున్నారు. గత పదేళ్లలో ఆయన అందించిన ఇంటర్వ్యూ మార్గదర్శకత్వంతో రెండు వేల మందికి పైగా అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. యూపీఎస్సీ టాపర్లు ఇషితా కిషోర్, దొనూరు అనన్య రెడ్డి, హర్షిత గోయల్ వంటి ఎంతో మందికి ఆయన మెంటర్‌గా వ్యవహరించారు. మానవ అక్రమ రవాణా నిరోధంపై 8 పుస్తకాల రూపకల్పనలో భాగస్వామి కావడంతో పాటు, జాతీయ పోలీస్ అకాడమీతో సహా వివిధ వేదికలపై అధికారులకు శిక్షణ అందించిన అనుభవం ఆయన సొంతం.

 

#HyderabadPoliceCommissionerMaheshBhagwat2026#MaheshBhagwatIPSNewCP#WomenSafetyDial100Hyderabad#HumanTraffickingHeroMaheshBhagwat#TelanganaPoliceNewsTelugu#HydNewsTelugu#CrimeNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి