తెలంగాణ

TG: హైకోర్టు సీరియస్.. రంగనాథ్ హాజరయ్యేలా చూడాలని డీజీపీకి ఆర్డర్!

4 నిమిషాల పఠనం

TG: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కోర్టు ధిక్కార వ్యవహారానికి సంబంధించి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

TG: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కోర్టు ధిక్కార వ్యవహారానికి సంబంధించి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ, రంగనాథ్ రాకపై సీరియస్ ఆదేశాలు జారీ చేసింది.

మినహాయింపు ఇచ్చేదే లేదు.. డీజీపీకే బాధ్యత!

విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకాకుండా ఉండేందుకు అధికారులు రకరకాల కారణాలతో మినహాయింపు కోరగా, హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్లను తోసిపుచ్చిన ధర్మాసనం.. మంగళవారం నాటి విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టు ఎదుట హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యతను ఏకంగా రాష్ట్ర డీజీపీకే అప్పగిస్తూ ఆదేశించింది. ఉన్నతాధికారులైనా చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

పోలీసులకు తేల్చిచెప్పిన ధర్మాసనం

ఇదే కేసులో శంషాబాద్ తహసీల్దార్ కూడా విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆయనకు కూడా ఎలాంటి మినహాయింపు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. శంషాబాద్ తహసీల్దార్ మంగళవారం కోర్టు ముందు నిలబడేలా సైబరాబాద్ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ప్రజలు, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తూ బుల్డోజర్ యాక్షన్‌తో సంచలనంగా మారిన హైడ్రా చీఫ్‌ను కోర్టు బోనులో నిలబెట్టేందుకు హైకోర్టు ఇంత తీవ్రమైన వైఖరి తీసుకోవడం, ఏకంగా డీజీపీకి ఆర్డర్ వేయడం ఇప్పుడు రాష్ట్ర అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.

#: Telangana#Telangana News#Hyderabad News#Telangana High Court#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి