ఏపీ

AP : ఏపీలో పిడుగుల బీభత్సం.. నలుగురు మృతి

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది.రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావం కారణంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది.రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావం కారణంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని కన్నీటిపర్యంతమైన అన్నదాత నేడు వర్షాలు కురుస్తుండటంతో పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇదిలాఉండగా, పల్నాడు జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడగా పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి భారీ వర్షంతో పాటు పెద్దఎత్తున పిడుగులు పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిడుగుపాటుకు గురై ఒకేరోజు నలుగురు మృతి చెందినట్టు సమాచారం.

పెట్లూరివారిపాలెంలో ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో ఆ భారీ శబ్దానికి గుండె ఆగి తల్లపునేని నాగమ్మ (63) మృతి చెందినట్టు తెలిసింది. అలాగే లక్ష్మీపురంలో ఇంటి పక్కనే పిడుగు పడటంతో ఆ భారీ శబ్దానికి గుండె ఆగి మేకల వెంకాయమ్మ (60) సైతం మృతి చెందినట్టు సమాచారం.. పాలపాడులో పిడుగుపాటుకు గురై రైతు డేరంగుల వెంకటయ్య మృతి చెందగా.. యక్కలవారిపాలెంలో పిడుగుపడి రైతు మజ్జిగ చిన్న కోటేశ్వరరావు మృతి చెందినట్టు తెలిసింది.

మరో రెండు గ్రామాల్లోనూ పిడుగులు బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. మరణాలకు సంబంధించి సమాచారం రావడంతో ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు ఘటనా ప్రాంతాలకు చేరుకుని మృతుల వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.వారికి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందజేయనున్నట్టు సమాచారం. కాగా, ఒకేసారి నలుగురు మరణించడంతో ఆయా గ్రామాలు,కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.కాగా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2099364488759984448?s=20

#lightning-havoc#andrapradesh#thunders#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి