తెలంగాణ

Konda Surekha: ఒకప్పటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫుల్ సైలెంట్.. కొండా సురేఖ మౌనం వెనుక అర్థమేంటి?

5 నిమిషాల పఠనం

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌గా, ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నాయకురాలిగా కొండా సురేఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌గా, ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నాయకురాలిగా కొండా సురేఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మంత్రి పదవి పోయినప్పటి నుంచి మాజీ మంత్రి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ పూర్తిగా సైలెంట్ అయిపోయారని, ఎక్కడా బహిరంగంగా కనిపించడం లేదని స్థానికంగా వినిపిస్తోంది. ఒకప్పుడు నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉండే కొండా ఫ్యామిలీ ఇప్పుడు ఇంతలా మౌనం వహించడం వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.

బర్తరఫ్ వేటు తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు!

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం ఏఐసీసీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. స్థానిక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆ ఘటన జరిగినప్పటి నుంచే కొండా ఫ్యామిలీ రాజకీయంగా పూర్తిగా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కొండా సురేఖ పెద్దగా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ పర్యటనల్లో గానీ ఆమె మునుపటిలా యాక్టివ్‌గా పాల్గొనడం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు.

కార్యకర్తల్లో నైరాశ్యం.. పట్టు తప్పుతుందా?

దశాబ్దాలుగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో తమదైన పట్టు సాధించిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఇలా సైలెంట్ అవ్వడం వారి అనుచరులను అయోమయంలో పడేసింది. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, నియోజకవర్గ పనులు ఎలా చేయించుకోవాలో తెలియక కార్యకర్తల్లో ఒక రకమైన నైరాశ్యం అలుముకుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, సురేఖ బర్తరఫ్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాను ముందుండి నడిపించే మంత్రి లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ప్రతిపక్షాలు, స్థానిక ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉన్న ఒక్క మంత్రి సీతక్క కేవలం తన నియోజకవర్గం ములుగుకే పరిమితమవుతున్నారని, ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో సమీక్షలు జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొండా ఫ్యామిలీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

ఒకవైపు ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగంపై పట్టు లేక పాలన గాడి తప్పిందన్న విమర్శలు, మరోవైపు కొండా సురేఖ మౌనం.. వెరసి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొండా సురేఖ ఈ మౌనాన్ని వీడి మళ్లీ నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారా, లేక ఆమె సైలెన్స్ వల్ల వరంగల్ ఈస్ట్‌లో కొండా ఫ్యామిలీ పట్టుతప్పి ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతుందా అన్నది వేచి చూడాలి.

#Konda Surekha#Konda Murali#Telangana Politics#Telangana Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి