Kollywood: లెజండరీ డైరెక్టర్ మణి రత్నం ప్రస్తుతం ఇంజి వెల్లం అనే సినిమాను రూపొందిస్తున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఇటీవలే, షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలిపింది చిత్రబృందం. మణి రత్నం సినిమాలలో ఇంత తక్కువ సమయంలో షూటింగ్ పూర్తైన సినిమా ఇదే కావడం విశేషం. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవిని ఇద్దరు పిల్లలకి తల్లిగా మణి రత్నం చూపించబోతున్నాడట.
సహజమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి ఇప్పుడు మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతుండటం విశేషం. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించనుండటం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. ఎందుకంటే, మణి రత్నం సినిమాలలో హీరోహీరోయిన్ల మధ్య చక్కటి రొమాన్స్ ఉంటుంది.
ఇటీవలే వచ్చిన మైథలాజికల్ మూవీ రామాయణ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటించి మెప్పించింది. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా..రామాయణ పార్ట్ 1 ఊహించని వసూళ్లను రాబడుతూ..బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ముఖ్యంగా, విమర్శించిన వాళ్ళే సాయి పల్లవిని ఇప్పుడు సీతగా చక్కటి నటనను కనబరిచిందని మెచ్చుకుంటున్నారు.
సాయి పల్లవితో మరో ప్రయోగం..
అమరన్ సినిమాలో అద్భుతమైన నటనను చూపించిన సాయి పల్లవికి, ఇప్పుడు మణి రత్నం రూపొందిస్తున్న ఇంజి వెల్లం సినిమాలో పాత్ర మరో గొప్ప అవకాశం అని చెప్పాలి. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర సాయి పల్లవి చేసింది లేదు. కాబట్టి, ఖచ్చితంగా ఇది సాయి పల్లవితో మణి చేస్తున్న గొప్ప ప్రయోగమే అని చెప్పాలి. మరి, ఈ సినిమా కథ ఎలా ఉంటుందో..సాయి పల్లవి-విజయ్ సేతుపతి ఎలాంటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోకున్నారో చూడాలి. ఏదేమైనా ఇద్దరు పిల్లలకి తల్లిగా కనిపించబోతుందనే మాట మాత్రం ఎంతో ఆసక్తిగా ఉంది.


