- ఆ పీఆర్వో రూటే సపరేట్ స్వేచ్ఛ న్యూస్ కథనంపై మంత్రి ఆరా?
- ఉద్యోగుల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్.. నీ సేవలు చాలంటూ మందలింపు?
- సోషల్ వెల్ఫేర్‌కు వెళ్లాలని ఆ కాంట్రాక్ట్ ఉద్యోగికి సూచన?
- గత పదేండ్లలో డబుల్ జీతాలు తీసుకున్న అందరిపై చర్యలు ఏవి?
- స్కాంలో నెలకు రూ.50 కోట్ల ఔట్ సోర్సింగ్?
- లక్షల్లో డబుల్ జీతాలు తీసుకున్నవారు 40 మంది
- ఘోస్ట్ ఎంప్లాయిస్ బాగోతంపై స్వేచ్ఛ న్యూస్ కథనాలు
- 7 రోజుల్లో విచారణ పూర్తి చేయలన్న సీఎస్ సంజయ్ జాజు
- ఆదేశాలు ఏమయ్యాయో.. నిరుద్యోగులకైనా చెబుతారా సార్?
- ఎంప్లాయిస్ ఏజెన్సీలు వెయ్యి కోట్ల ఫీఎప్ స్కాంపై అప్డేట్ ఉందా?
- కలెక్టర్స్ భూములపై పడి సిబ్బంది సంగతి ఏంటో మర్చిపోతున్నారా?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
ఏ ప్రభుత్వంలోనైనా కష్టపడి పని చేస్తేనే మంచి గుర్తింపు ఉంటుంది. కులాలు, మతాలు అంటూ ఎన్ని రోజులు నెట్టుకురాలేమని మరోసారి రుజువైంది. దక్షణ తెలంగాణలో ఓ మంత్రి వద్ద పని చేస్తున్న పీఆర్వో వ్యవహారంపై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ఇచ్చారు. ప్రత్యేక క్యాబిన్‌తో ఎవరికీ లేని విధంగా సకల సౌకర్యాలు కల్పించడంపై నిలదీశారు.
సదరు పీఆర్వో తాను చేస్తున్న ఉద్యోగానికి కనీస న్యాయం కూడా చేయలేదు. పైగా మంత్రి భార్య పేరు చెప్పుకొని మేడమ్‌తో అన్ని పనులు చేయిస్తానని పైరవీలు చేయడం గుర్తించారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులను సైతం ఏకవచనంతో మాట్లాడటం, తోటి ఉద్యోగులను వేధించటం బహిరంగంగానే జరిగాయి. మహిళా ఉద్యోగుల ముందు వాటర్ బాటిల్స్ కాళ్ల మధ్యలో పెట్టుకుని ఆటలాడుతూ మాట్లాడేతత్వంతో చాలామంది ఉద్యోగులు చీదరించుకున్నారు.
ఇలా ఎన్నో ఆగడాలకు అడ్డాగా మారిన పీఆర్వో తీరుపై స్వేచ్ఛ న్యూస్ కథనం ప్రచురించింది. సీఎం సీపీఆర్వో దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ పీఆర్వో మంత్రి ఫీల్డ్ వర్క్‌పై ఎన్ని ప్రెస్ నోట్‌లు పంపించారు. ఎన్ని కథనాలు రాసి మీడియాకు ఇచ్చారో వివరాలు సేకరించారు. దీంతో పీఆర్వోగా ఈయన ప్రభుత్వానికి ఏం సేవలు చేస్తున్నారని అనుమానం వచ్చింది. దీనికి తోడుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఏం చేసేవారని ఆరా తీయగా.. అక్కడ లక్షల్లో జీతం తీసుంటున్నట్టు.. అలాగే మంత్రి వద్ద పీఆర్వో ఉద్యోగానికి కూడా జీతం తీసుకుంటున్నట్టు గుర్తించారు.. ఇలా ఈ ప్రబుద్ధుడి లీలలు బయటపడిన తర్వాత నెలకు 60 వేల జీతం ఆపేశారని సమాచారం.
సీఎస్ గారు 7 రోజులు అయిపోయాయి.. ఎంతమంది వద్ద నుంచి రికవరీ చేశారు?
నిరుద్యోగులు రోజురోజు ప్రభుత్వంపై ఏదో విధంగా విరుచుకుపడుతున్నారు. పస్తులు ఉండి చదువుకుంటే మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పిన వారి జాడ లేదని ధర్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒక్క ఉద్యోగం చేసి రెండు జీతాలు తీసుకుంటున్న వారి స్కాం వెలుగులోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ పేరుతో 15 వేల మంది వరకు ఫేక్ సంతకాలతో ఏడాదికి రూ.600 కోట్లు దోచేశారని స్వేచ్ఛ కథనాలు రాసింది.
తాజాగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ఆధార్ సీడింగ్ సమయంలో 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం 80 మంది ఎంప్లాయిస్‌గా ఎంట్రీ అయ్యాయి. ఒకే ఆధార్‌పై జీతాలు తీసుకుంటున్నారు. డీజీపీ ఆఫీస్‌లో, విద్యా శాఖలో, పంచాయతీ రాజ్, పబ్లిక్ హెల్త్, అగ్రికల్చర్ శాఖలో ఎక్కువ కనిపించాయి. ఒక మహిళా ఉద్యోగి ఏప్రిల్ నెలలో రెవెన్యూ శాఖ నుంచి 2 లక్షలు జీతం తీసుకుంటూనే, పోలీస్ శాఖ నుంచి 1.5 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి..
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఇలా నెలకు కోటి రూపాయలు అందుకుంటూ.. రెండు జీతాలతో ఖజానాకు నష్టం వాటిల్లేలా చేశారని గుర్తించి సీఎస్.. ప్రతి డిపార్ట్‌మెంట్‌పై 7 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, వారి వద్ద నుంచి రికవరీ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వ సొమ్ముతో రెండు ఉద్యోగాల పేర్లతో ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు కలిపి 15 వేల మంది వరకు డబుల్ జీతాలు తీసుకోవడం స్కాంగా మారింది. 7 వేల మంది ఉద్యోగాలకు కోత విధించారని స్వేచ్చ న్యూస్ కథనంతో బయటపెట్టింది.
పీఎఫ్ స్కాంపై ఆరా తీస్తున్నారా సర్?
సీఎస్ సంజయ్ జాజుపై ప్రస్తుతం అధికారిక పనుల ఒత్తిడి ఉంది. మాజీ సీఎస్‌లు సీఎంతో కలిసి పలు అంశాలపై సలహాలు ఇస్తున్నారు. అయితే, సొంత ఉద్యోగులకు బాస్‌గా ఉండే సీఎస్‌కు ఉద్యోగుల పేర్లతో జరిగిన అవకతవకలు, స్కాంలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
మీరు చెప్పినట్లుగానే పీఎఫ్ పేరుతో సుమారు రూ.1,100 కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్స్‌ను నిలిపివేశారు. కానీ, ఇప్పటివరకు రికవరీ చర్యలు ఏమేరకు చేపట్టారనే దానిపై స్పష్టత లేదు. అలాగే, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయన్నది కూడా వెల్లడికాలేదు.
ఉద్యోగులు బాగుంటేనే ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేస్తుంది. అందుకే బ్యూరోక్రసీ స్థాయిలోనే కాకుండా కింది స్థాయి నుంచి కూడా పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ఇక కలెక్టర్లు భూముల వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టి, తమ పరిధిలోని సిబ్బంది సమస్యలు, పనితీరును మర్చిపోకూడదు.
వారికి కూడా తమ పూర్తి బాధ్యతలను మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే భూముల సెటిల్‌మెంట్లు, ఇతర వ్యవహారాల్లో నిమగ్నమై చిన్న జిల్లాల్లోనే పని ఒత్తిడిగా భావిస్తున్న అధికారులకు కూడా తమ బాధ్యతలను గుర్తుచేసేలా చర్యలు తీసుకోవాలి సార్.


