స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్దపడింది. SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన రూల్స్ లో కీలక మార్పులు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచిబ్యాంకు కస్టమర్లు నెలలో నాలుగు సార్లు మాత్రమే ఫ్రీగా క్యాష్ విత్ డ్రా చేసుకోవాలని తెలిపింది. ఆ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ. 15 ఛార్జ్ తో పాటు జీఎస్టీ కూడా వసూలు చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
కాగా ఇందులో బ్రాంచ్, ఏటీఎం, విత్ డ్రాస్ తో పాటు ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ కూడా కౌంట్ అవుతాయని అంటున్నారు. అయితే ఇదివరకు నాలుగు ఉచిత లావాదేవీలు చేసిన తర్వాత రూ.15 ఛార్జ్ విధించేవారు. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ దీని పరిధిలో లేదు. ఇప్పుడు ఆ మినహాయింపు కూడా లేదని అధికారులు అంటున్నారు. ఈ నిబంధన ప్రకారం.. ఇకపైన ఏటీఎం, బ్రాంచ్, డిజిటల్ ట్రాన్సాక్షన్ అన్ని కలిపి ఉచిత క్యాష్ విత్ డ్రా పరిమితి నాలుగు లావాదేవీలకు మించి ఉండదని తెలుస్తుంది. కాగా SBI అక్టోబర్ 1 నుంచి ఈ ఛార్జ్ అమలు చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
మరోవైపు ఈ రూల్ వల్ల చిన్న మొత్తాల కోసం పదేపదే నగదు విత్‌డ్రా చేసేవారికి ఈ ఛార్జీలు భారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పెన్షన్, జీతం లేదా ఇతర అవసరాల కోసం తరచూ నగదు తీసుకునే కస్టమర్లు.. నెలలో ఎన్ని క్యాష్ విత్‌డ్రాలు చేశామో గమనించడం మంచిదని తెలుస్తుంది. ఇక బ్యాంకింగ్‌లో ఛార్జీలు మారుతున్నా, చాలామంది కస్టమర్లకు వాటి గురించి పూర్తి అవగాహన ఉండదు.
ఖాతా నుంచి డబ్బు కట్ అయిన తర్వాతే విషయం తెలుస్తోంది. అందుకే ప్రతి కస్టమర్ తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించాలి. ఏ ఛార్జీ ఎందుకు పడిందో అర్థం కాకపోతే వెంటనే బ్యాంకును సంప్రదించి వివరణ కోరాలి.. దీనివల్ల అదనపు డబ్బు కోల్పోకుండా.. కొత్త నిబంధనలు, సర్వీస్ ఛార్జీలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కస్టమర్లకు అత్యంత అవసరం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


