తెలంగాణ

NEET PG : నీట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మెడికల్ సీట్లు భారీగా పెంపు!

5 నిమిషాల పఠనం

ఎంబీబీఎస్ విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,839 పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్రంలో గతేడాది 3,721గా ఉన్న మొత్తం పీజీ సీట్ల సంఖ్య ప్రస్తుత విద్యా సంవత్సరానికి 4,417కు చేరింది.అనగా 696 సీట్లు అదనంగా పెరిగాయి. ఏపీలో 3,908 నుంచి 4,316 చేరగా.. 408 సీట్లు అదనంగా పెరిగాయి.

ఎంబీబీఎస్ విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,839 పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్రంలో గతేడాది 3,721గా ఉన్న మొత్తం పీజీ సీట్ల సంఖ్య ప్రస్తుత విద్యా సంవత్సరానికి 4,417కు చేరింది.అనగా 696 సీట్లు అదనంగా పెరిగాయి. ఏపీలో 3,908 నుంచి 4,316 చేరగా.. 408 సీట్లు అదనంగా పెరిగాయి.

ఇదిలాఉండగా, గతంలో కేవలం పది కాలేజీల్లోనే పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు ఉండగా.. ఇప్పుడు మరో 13 కాలేజీలకు ఆ సౌకర్యం పెరిగింది. నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వనపర్తి, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, నిర్మల్, సంగారెడ్డి, నర్సంపేట కాలేజీలకు తొలిసారిగా పీజీ సీట్లను పెంచనున్నట్టు సమాచారం.

2025లో ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 58,466 పీజీ సీట్లు ఉండగా, 2026 నాటికి ఆ సంఖ్య 68,305కు పెరిగాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,440 సీట్లు (30,033 నుంచి 34,473), ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,809 సీట్లు (20,923 నుంచి 24,732), డీమ్డ్ వర్సిటీలలో 1,590 సీట్లు (7,510 నుంచి 9,100) లెక్కన భారీగా పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కాలేజీలకే ప్రాధాన్యం..

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 1,469 నుంచి 1,838కు పెరిగాయి. అనగా 369 సీట్లు అదనం. ప్రైవేటు కాలేజీల్లో 1,956 నుంచి 2,229కు పెరిగాయి. అనగా 273 సీట్లు అదనం. డీమ్డ్ వర్సిటీల్లో 296 నుంచి 350కు పెరగగా.. 54 సీట్లు అదనంగా పెరిగాయి.మొత్తంగా రాష్ట్రంలో 696 సీట్లు అదనం పెరిగాయి.

ఇక ఏపీలోని ప్రభుత్వ కాలేజీల్లో 1,980 నుంచి 2,143 సీట్లు పెరిగాయి. అనగా 163 సీట్లు అదనంగా వచ్చాయి. ప్రైవేటులో 1,876 నుంచి 2,121కు పెరగగా.. 245 సీట్ల అదనంగా వచ్చాయి. డీమ్డ్ వర్సిటీల్లో ఎలాంటి మార్పు లేకుండా 52 సీట్లు అలాగే ఉన్నాయి. ఏపీలో మొత్తంగా 408 సీట్లు పెరిగాయి. తెలంగాణలో స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్ల రిజర్వేషన్ నిబంధన అమలులో ఉంది. తాజా పెంపుతో లోకల్ విద్యార్థులకు క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో కలిపి ప్రత్యక్షంగా 132 సీట్లు లభించనున్నాయి. పెరిగిన సీట్లతో కటాఫ్ ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకుని అధికంగా సీట్లు దక్కే అవకాశం ఉంది.

స్థానికులకు దక్కే 132 సీట్లు..

అనస్థీషియా -26, ఆర్థోపెడిక్స్ -16, పాథాలజీ -14, గైనకాలజీ -11, పీడియాట్రిక్స్-11, రేడియాలజీ -10, జనరల్ సర్జరీ -9, జనరల్ మెడిసిన్ -9, ఆప్తాల్మాలజీ -7, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్-6, ఈఎన్‌టీ -5, డెర్మటాలజీ -5, సైకియాట్రీ విభాగం -3లో సీట్లు ఉన్నాయి.

#NEET PG#medical seats#increase#nationalwide#Telugustates#Education#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి