సినిమా

Bollywood: రామాయణతో యష్ కి మళ్ళీ నష్టాలేనా?

5 నిమిషాల పఠనం

Bollywood: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యష్. 'కేజీఎఫ్' సినిమాలతో దేశవ్యాప్తంగా రాకింగ్ స్టార్ అంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు 'రామాయణ'తో అంతర్జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో యష్ రావణుడిగా నటించడం విశేషం. నటుడిగానే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యాడు. అయితే, ఈ సినిమా యష్ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుంది? భారీ లాభాలు తెచ్చిపెడుతుందా?

Bollywood: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యష్. 'కేజీఎఫ్' సినిమాలతో దేశవ్యాప్తంగా రాకింగ్ స్టార్ అంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు 'రామాయణ'తో అంతర్జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో యష్ రావణుడిగా నటించడం విశేషం. నటుడిగానే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యాడు. అయితే, ఈ సినిమా యష్ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుంది? భారీ లాభాలు తెచ్చిపెడుతుందా? లేక భారీ అంచనాల కారణంగా రిస్క్ కూడా పెరుగుతుందా? అనేది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వస్తోన్న టాక్ చూసి సినీ విశ్లేషకులు అంటున్నారు.

రావణుడిగా యష్.. మరోసారి మాస్ ఇమేజ్‌కు పరీక్ష!

రామాయణ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించారు. రావణుడి పాత్రలో యష్, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. సాధారణంగా రామాయణంలో రావణుడి పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రలోని అహంకారం, రాజసం, బలం, భావోద్వేగాలను తెరపై చూపించడానికి మంచి అవకాశం ఉంటుంది.

'కేజీఎఫ్'లో రాకీ భాయ్‌గా తనదైన మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యష్‌కు రావణుడి పాత్ర మరో భిన్నమైన గుర్తింపును తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆయన పాత్ర వరకూ అద్భుతంగా చేశాడనే ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ, ఇతిహాసం ఆధారంగా రూపొందించిన సినిమా కావడంతో రామాయణ గాధ అందరికీ తెలియడం వల్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదంటున్నారు. పైగా, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చి 5 ఏళ్ళు కూడా కాలేదు.

రెమ్యునరేషన్ లేదు.. లాభాల్లోనే వాటా!

ఈ సినిమా విషయంలో యష్ తీసుకున్న నిర్ణయం కూడా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా భారీ రెమ్యునరేషన్ తీసుకునే పద్ధతికి బదులుగా నిర్మాతగా భాగస్వామ్యం తీసుకున్న యష్.. ఈ సినిమా మంచి వసూళ్లు రాబడితే వాటా రూపంలో ఎక్కువ లాభాలు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద గనక రామాయణ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే నష్టాలను మోయాల్సి ఉంటుంది. ఇక్కడే, యష్ డేరింగ్ స్టెప్ వేశాడు. ఇప్పటికే, టాక్సిక్ సినిమాతో తీవ్రంగా ఆర్ధిక నష్టాలను, పాత్ర పరంగా విమర్శకను ఎదుర్కొన్నాడు. లాంగ్ రన్‌లో రామాయణ ఎలాంటి అనుభవాలను ఇస్తుందో చూడాలి.

#Bollywood#Ramayana#Yash#Nithish Thiwari
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి