టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడితో సురేఖ వాణి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై సురేఖ వాణి స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి, తనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను, కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికల్లోకి లీక్ చేసి ప్రచారం చేస్తున్నారని వాపోయింది.
తమ ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడటంపై సురేఖ వాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అనుమతి లేకుండా ప్రైవేట్ కంటెంట్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వారిని హెచ్చరించింది. మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానెళ్లు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వినియోగదారులు ఎవరైనా సరే తన వ్యక్తిగత వీడియోలను అప్లోడ్ చేయడం, రీపోస్ట్ చేయడం లేక షేర్ చేయడం తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
కేవలం వ్యూస్, లైక్స్, పబ్లిసిటీ కోసం ఇతరుల ప్రైవసీని బలిచేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని చెప్పుకొచ్చింది. తన ప్రైవేట్ కంటెంట్‌ను ప్రచారం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సురేఖ వాణి తేల్చిచెప్పింది. తన హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రైవేట్ వీడియోలను షేర్ చేసినా లేక ప్రచారం చేసినా, సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో వారి ఐపీ అడ్రస్ ఆధారంగా వివరాలు సేకరించి చట్టపరంగా కేసులు నమోదు చేయిస్తానని స్పష్టం చేసింది.
అదేవిధంగా తన ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ డిజిటల్ నేరంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సురేఖ వాణి సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉంటూ భారీగా ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. ఒక ప్రముఖ నటి ఇన్స్టాగ్రామ్ ఖాతానే హ్యాక్‌కు గురై ప్రైవేట్ వీడియోలు బయటకు రావడం, సైబర్ భద్రతపై టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


