తెలంగాణ

TG : రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకల ఖర్చు రూ.150 కోట్లు?

4 నిమిషాల పఠనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు రూ.150 కోట్ల ఖర్చు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాక్సులు కట్టే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని తన స్వార్థం కోసం వినియోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు రూ.150 కోట్ల ఖర్చు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాక్సులు కట్టే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని తన స్వార్థం కోసం వినియోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఒక పక్క కరెంట్, నీళ్లు లేక రైతులు, ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పుట్టినరోజు సంబురాల్లో రేవంత్ సర్కార్ మునిగి తేలుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

మీడియా ప్రచారానికే సగభాగం..

ప్రజల సొమ్ముతో భారీగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారాలు చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నవంబర్ 8 (దీపావళి పండుగ)నాడు తన పుట్టినరోజు వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో జరుపుకోనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు మంత్రులు, అధికారులందరూ కొడంగల్లోనే ఉండేలా ముఖ్యమంత్రి ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది.

మూడు రోజులు తన సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు.అయితే, కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే సభలకు జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను అధికారులు సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ మూడు రోజలు జాతీయ పత్రికలు, లోకల్ టీవీ ఛానెళ్లలో రేవంత్ రెడ్డి గురించి వరుసగా ప్రకటనలు వచ్చేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, కొడంగల్ నియోజకవర్గంలో రూ.9,,053 కోట్ల పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు.

ఇందులో రూ.5,060 కోట్లతో నిర్మిస్తున్న రేడియల్ రోడ్లకు కేటాయించినట్టు తెలుస్తోంది. మిగతా నిధులను గ్రామాల్లో రహదారులు, ఆరోగ్య కేంద్రాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించనున్నారు.అంతేకాకుండా, CSR నిధులతో చేపడుతున్న మరికొన్ని పనులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు.కాగా, ఆయన పబ్లిసిటీ కోసం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

#Cm revanth reddy#birthday#towmarrow#celebrations#public money expense#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి