తెలంగాణ

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. జూరాల నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్

రచన: NK5 నిమిషాల పఠనం

Farmers Protest: జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటలు ఎండుముఖం పడుతుండడంతో రైతులు జూరాల డ్యాంపై ధర్నా చేపట్టారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అధికారులు బంద్ చేశారు. దీంతో పంటలకు నీరు అందక సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పంటలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.

Farmers Protest: జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటలు ఎండుముఖం పడుతుండడంతో రైతులు జూరాల డ్యాంపై ధర్నా చేపట్టారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అధికారులు బంద్ చేశారు. దీంతో పంటలకు నీరు అందక సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పంటలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. జూరాల ప్రాజెక్టు నుంచి పంటలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట కూడా రైతులు ఆందోళన చేపట్టి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి, నెలల తరబడి శ్రమించిన పంటలు తమ కళ్ల ముందే వాడిపోతుంటే చూస్తూ ఉండలేక రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పంటలకు సకాలంలో నీరు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పంటలు కీలక దశలో ఉన్నాయని, మరికొద్ది రోజులు నీరు అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి జూరాల నుంచి పంటలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి రావడం పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. పంటలు ఎండిపోయిన తర్వాత కాకుండా ఇప్పుడే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టు వద్ద రైతుల ధర్నా

జూరాల, నెట్టెంపాడు ఆయకట్టు కింద సాగు చేసిన వరి ఇతర పంటలకు సాగునీరు అందించాలని రైతులు జూరాల డ్యాం ముట్టడించారు. పెద్ద సంఖ్యలో రైతులు ప్రాజెక్టు వద్ద ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాణాలైనా అర్పిస్తాం .. పంటలను కాపాడుకుంటాం అంటూ రైతులు నినాదాలు చేశారు.

రైతులకు బీజేపీ సంఘీభావం

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువకు నీరు వదలాలని జూరాల డ్యాం వద్ద రైతుల చేపట్టిన ధర్నాకు బీజేపీ మద్దతు ప్రకటించింది. జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్దా రెడ్డి అదేశానుసారం బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు రైతులకు సంఘీభావం తెలిపి వెంటనే కుడి కాలువకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జూరాల ఎడమ కాల్వ గేట్లు ఎత్తిన రైతులు

సాగు నీటి కోసం రైతులు జూరాల డ్యాంను ముట్టడించారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి పంటలు బతకాలంటే తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సాయంత్రం వేళ రైతులు అధిక సంఖ్యలో జూరాల డ్యాంకు చేరుకుని ఎడమ వైపు గేట్లను తెరిచారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

#Farmers Protest#Jurala Dam#Jurala Project#Irrigation#Water#Crops#Gadwal#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి