దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది.ఓ మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు తమ ప్రతాపం చూపించారు. బాధితురాలు తన విధినిర్వహణలో భాగంగా ఢిల్లీ సీఎం రేఖాగుప్తాను ప్రశ్నించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ప్రశ్నించిన జర్నలిస్టు మీద పోలీసులు దాడి చేసిన ఘటన దేశరాజధానిలో హాట్ టాపిక్ అయ్యింది.
పోలీసులు దాడి చేయడంతో మహిళా జర్నలిస్టు కింద పడిపోయినట్టు తెలిసింది.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకివెళితే.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ‘4PM’ న్యూస్‌కి చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్ ప్రశ్నించడానికి ప్రయత్నించినట్టు సమాచారం. దాంతో ‘సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది?’ అంటూ ఢిల్లీ పోలీసులు సదరు మహిళా జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
అనంతరం ఆమె పేరులో ‘ఖాన్’ ఉందని తెలిసి పోలీసులు మరింత రెచ్చిపోయి వాతలు పడేలా కొట్టారని తెలుస్తోంది. షాహీన్‌తో ఉన్న మరో మహిళను కూడా ఘోరంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. కాగా, సీఎంని ప్రశ్నించడం తప్పా..? జర్నలిస్టుగా వాళ్లు తమ బాధ్యతని నిర్వర్తించడం నేరమా? అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎదురైనా ఈ అన్యాయాన్ని వివరిస్తూ జర్నలిస్ట్ షాహీన్ ఖాన్ కన్నీటిపర్యంతమైంది.
https://x.com/pulsenewsbreak/status/2095671686112608312?s=20
తాను ముస్లింనని తెలిసి తమ మనసులో ఉన్న విషాన్ని చిమ్ముతూ మరింత దారుణంగా కొట్టారని సదరు మహిళా జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రధాని మోడీ చెప్పిన రామరాజ్యం ఇదేనా? అంటూ కేంద్రంలోని మోడీ సర్కారుకు చురకలు అంటించారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయని గుర్తుంచుకోవాలని.. ప్రజలు ఓట్లు వేయడం వల్లే కేంద్రంలో,దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరాయని.. ప్రశ్నించినందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.









