జాతీయం

Assam Bus Accident: ఘోరం.. ట్రక్కు ఢీకొని 23 మంది మృతి.. నుజ్జయిన బస్సు!

3 నిమిషాల పఠనం

Assam Bus Accident: అస్సాంలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కాజీరంగా నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఓ మినీ బస్సు, భారీ కంటైనర్‌ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు విద్యార్థులు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Assam Bus Accident: అస్సాంలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కాజీరంగా నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఓ మినీ బస్సు, భారీ కంటైనర్‌ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు విద్యార్థులు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బోకాఖాత్‌ నుంచి నాగావ్‌ వైపు వెళ్తున్న మినీ బస్సు, కాజీరంగా పార్క్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న చాలామంది లోపలే చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రూల్స్ బ్రేక్ చేసి నేషనల్ పార్క్‌ సమీపంలో బస్సును అతి వేగంతో నడపడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతివేగం వల్లే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న అస్సాం పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నుజ్జునుజ్జయిన బస్సులో చిక్కుకున్న మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 15 మంది ఘటనాస్థలంలోనే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరికొందరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

#Assam Bus Accident#Assam Road Accident#Kaziranga National Park#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి