సినిమా

NTR-TRIVIKRAM: అవన్నీ సెన్స్ లెస్ రూమర్స్..

4 నిమిషాల పఠనం

NTR-TRIVIKRAM: ఇటీవల ఇటు సినీ వర్గాలలో, నందమూరి అభిమానుల్లో, సోషల్ మీడియాలో ఒకే వార్త చక్కర్లు కొట్టి బాగా వైరల్ అయింది. అదేమిటంటే.. త్రివిక్రమ్, హారికా హాసిని బ్యానర్ నుంచి దూరం అయినట్టుగా, వీరి కాంబినేషన్‌లో ఎన్టీఆర్ హీరోగా రూపొందాల్సిన 'గాడ్ ఆఫ్ వార్' ఆగిపోయిందని. కానీ, తాజాగా హారిక అండ్ హాసిని వారు ఇవన్నీ సెన్స్ లెస్ న్యూస్ అంటూ కొట్టి పారేశారు. ఈ కాంబోకి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది.

వెంకటేష్ 'ఆదర్శకుటుంబం' తెచ్చిన తంటా:

ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శకుటుంబం సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఒకరకంగా, చెప్పాలంటే వరుసగా ఎఫ్ 2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్‌గారు లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వెంకీకి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదర్శకుటుంబంతో ఫ్లాపిచ్చి బ్రేక్ వేశాడు.

నిర్మాణ సంస్థకి కూడా దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకూ నష్టాలు వచ్చినట్టుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారమైంది. దీంతో, ఇక హారిక హాసిని వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయరట..అంటూ వార్త స్ప్రెడ్ అయింది. అలాగే, ఈ కాంబోలో ప్లాన్ చేసిన ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కూడా లేనట్టే అని..ఈ సినిమాకి గురూజీ ఇచ్చిన 500 కోట్ల భారీ బడ్జెట్ కూడా ఇబ్బందులు తెచ్చిందని అన్నారు.

కట్ చేస్తే, తాజాగా మేకర్స్ ఇవన్నీ సెన్స్ లెస్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తూ బృందం అందరూ కలిసి ఉన్న పిక్‌ను షేర్ చేసింది. ఆల్రెడీ సైలెంట్‌గా ఎన్టీఆర్ సినిమాకి గురూజీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. నిన్నామొన్నటి వరకూ అంతటా వైరల్ అవుతున్న గాలి వార్తలకి చెక్ పెట్టారు. ఇక, తాజాగా వదిలిన ఫొటోలో నిర్మాతలు ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో పాటుగా నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉండటం విశేషం. సో..గాడ్ ఆఫ్ వార్ బడ్జెట్ 500 కోట్లైనా 600 కోట్లైనా ప్రాజెక్ట్ ఉందని తేలిపోయింది. అలాగే, హారికా అండ్ హాసిని నుంచి త్రివిక్రమ్ విడిపోయారన్న మాటలు తూచ్ అని అర్థమైంది.

#NTR#TRIVIKRAM#Harika And Hassine#NTR Arts#Nandamuri Kalyan Ram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి