Bollywood: మన టాలీవుడ్ హీరోలు, దర్శకులు హిందీలో సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో క్రిష్ హిందీ సీమలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి మణికర్ణిక చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా సమయంలో కంగనాతో ఆయనకి విబేధాలు వచ్చాయి. సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో మళ్ళీ, ఇప్పటి వరకూ క్రిష్ హిందీలో అడుగుపెట్టలేదు. వి.వి.వినాయక్ కూడా అంతే. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వినయ్ సక్సెస్ కాలేకపోయాడు.
తెలుగులో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డార్లింగ్ ప్రభాస్‌తో ఛత్రపతి సినిమాను తీసి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాడు. కానీ, అదే సినిమాను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో వినాయక్ తీశాడు. కనీసం ఈ సినిమా వచ్చినట్టుగా కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత వీరిద్దరు హిందీలో సినిమా ప్రయత్నాలను మానుకున్నారు. మళ్ళీ, ఇన్నాళ్ళకి మన తెలుగు డైరెక్టర్స్ ఇద్దరు హిందీలో తమ లక్‌ను చెక్ చేసుకోబోతున్నారు.
రవిబాబు, వంశీపైడిపల్లి హిందీలో హిట్ కొట్టగలరా?
దిల్ రాజు నిర్మాతగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి వంశీపైడిపల్లి దర్శకుడు. ఈ మధ్య వంశీకి సరైన హిట్ పడలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నో అన్న కథను తలపతి విజయ్‌తో వారిసు(వారసుడు) అంటూ తీసి ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఇప్పుడు, నేరుగా హిందీలో సినిమాను చేస్తున్నాడు. దిల్ రాజు ఈ మధ్య బాగా అర్ధిక నష్టాల్లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ ఐతే గట్టెక్కుతాడు.
ఇక, గత కొంతకాలంగా తెలుగులో సక్సెస్ అందుకోని దర్శకుడు, నటుడు రవిబాబు కూడా బాలీవుడ్‌లో స్కేరీ పిక్చర్ అనే సినిమాను తీస్తున్నాడు. కంగనా రనౌత్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన హర్రర్ సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేదు. అయినా, కూడా హిందీలో డెబ్యూ చేస్తున్న రవిబాబు ఇదే జానర్‌లో సినిమా చేయాలనుకోవడం పెద్ద సాహసం. మరి, వీళ్ళు అక్కడ ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి.


