తెలంగాణ

Rains : ముంచుకొస్తున్న అక్వాన్.. తెలంగాణలో భారీ వర్షాలు!

3 నిమిషాల పఠనం

మురసు తుఫాన్ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో గండం పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫాన్ క్రమంగా బలపడుతున్నట్టు సమాచారం. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై బలంగా ఉంటుందని, ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ కీలక సూచనలు చేశారు.

మురసు తుఫాన్ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో గండం పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫాన్ క్రమంగా బలపడుతున్నట్టు సమాచారం. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై బలంగా ఉంటుందని, ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ కీలక సూచనలు చేశారు. ఈ నెల 20న అక్వాన్ తుఫాను ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫలితంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుందని పేర్కొన్నారు.

దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు..

తుఫాను తీరం దాటే సమయంలో అనగా 20 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్ష ప్రభావం ఉన్న జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా నమోదు అవుతోంది.

నవంబర్ 20 నుంచి 22 వరకు వర్ష సూచన ఉండటంతో వరి కోతలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచించారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముందస్తు హెచ్చరికలు చేశారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.

#Heavy rainfall#Telangana#Andrapradesh#Cyclone Aqua#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి