స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Hyderabad : ఉపయోగం లేని ట్రాఫిక్ అంబరిల్లాతో కోట్లల్లో దందా!

4 నిమిషాల పఠనం

హైదరాబాద్ ట్రాఫిక్ అనగానే పొల్యూషన్.. యూటర్న్.. సిగ్నల్స్.. పోలీసులు.. బాటసారుల తిప్పలు.. వాహనదారుల అవస్థలు.. ఇలా అన్నీ గుర్తుకొస్తాయి. కానీ, దీని వెనుక ఏటా రూ.300 కోట్ల మాఫియా దందా ఉందని మీకు తెలుసా?. అంతేకాదు ఉన్నతాధికారులు, పోలీసులతో కుమ్మక్కు అయి అడ్వటైజింగ్ మాఫియా రూ.కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. ప్రభుత్వ ఖజానాను సైతం దోచేస్తోంది.

-ఇల్లీగల్‌గా 3 వేలకు పైగా అడ్వటైజింగ్ బోర్డ్స్!

- పబ్లిక్‌కు వన్ వే, లాంగ్ యూటర్న్ కష్టాలు

- అడ్వటైజింగ్ మాఫియా జేబులోకి కోట్లకు కోట్లు

- గత 5 ఏండ్లుగా ట్రాఫిక్ పోలీస్ పేరుతో రూ.300 కోట్ల వరకు దందా!

- జీహెచ్ఎంసీకి బోర్డులు వాడుకున్నందుకు లీగల్‌గా ట్యాక్స్ కట్టాల్సింది రూ.60 కోట్లు

- అనవసరపు ట్రాఫిక్ అంబరిల్లా అడ్వటైజింగ్ బోర్డ్స్ అవసరమా?

- ఇలాంటి స్కాంలు ఎన్నో ఉన్నాయి

- ఇన్వెస్టిగేషన్ కథనాల కోసం రోజూ ఫాలో అవ్వండి swechaanews.com

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

హైదరాబాద్ ట్రాఫిక్ అనగానే పొల్యూషన్.. యూటర్న్.. సిగ్నల్స్.. పోలీసులు.. బాటసారుల తిప్పలు.. వాహనదారుల అవస్థలు.. ఇలా అన్నీ గుర్తుకొస్తాయి. కానీ, దీని వెనుక ఏటా రూ.300 కోట్ల మాఫియా దందా ఉందని మీకు తెలుసా?. అంతేకాదు ఉన్నతాధికారులు, పోలీసులతో కుమ్మక్కు అయి అడ్వటైజింగ్ మాఫియా రూ.కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. ప్రభుత్వ ఖజానాను సైతం దోచేస్తోంది.

ట్రాఫిక్ పోలీస్ పేరుతో దోపిడీ..

మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉండేందుకు అంబరిల్లాలు కనిపిస్తాయి. కొన్నిచోట్ల ఇవి మధ్యలో ఉంటాయి. ఇంకొన్ని చోట్ల ఏదో ఒక సైడ్‌కు కనిపిస్తాయి. అయితే, సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వన్ వే, లాంగ్ యూటర్న్స్ అయిపోయాయి. ట్రాఫిక్ పోలీస్ అంబరిల్లాలను వాడుతున్నది అంతంతమాత్రమే. కానీ, అడ్వటైజింగ్ మాఫియా మాత్రం గట్టిగా వాడేస్తోంది. ఇష్టం వచ్చినట్లు యాడ్స్ వేసుకుంటూ కోట్లు వెనకేసుకుంటోంది. ట్రాఫిక్ పేరుతో గత ఐదేళ్లుగా ఏడాదికి రూ.60 కోట్ల వరకు ఇల్లీగల్‌గా సంపాదిస్తోంది. ట్రాఫిక్ పోలీస్ పేరుతో ఏర్పాటు చేసిన అంబరిల్లాలను అడ్వటైజింగ్ మాఫియా యథేచ్ఛగా ఆదాయ వనరుగా మార్చేసింది.

Hyderabad : ఉపయోగం లేని ట్రాఫిక్ అంబరిల్లాతో కోట్లల్లో దందా!

ఈ దందాలన్నీ ఉన్నతాధికారులను, పోలీసులను మేనేజ్ చేస్తూనే చేస్తున్నారు. హాయిగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని గత ఐదేళ్లుగా రూ.300 కోట్ల వరకు సంపాదించారు. మొదట్లో 600 అంబరిల్లాలకు అనుమతులు తీసుకుని ఆ తర్వాత ఇల్లీగల్‌గా 3 వేలకు పైగా ఏర్పాటు చేశారు.క్యూర్ సిటీలో లీడ్ స్పేస్,ఔట్ స్పేస్,నవీన్ అనే వ్యక్తి ఎక్కడికక్కడ ఈ దందా చేస్తూ దోచుకుంటున్నట్టు సమాచారం.

#Traiffc umbreallas#hyderabad#GHMC limits#Telangana#Advertisement#money looting
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి