సినిమా

Tollywood: రాధిక ఆప్టే కూడా పూజాలా క్షమాపణలు చెప్పాల్సిందే!

5 నిమిషాల పఠనం

Tollywood: రాధిక ఆప్టే కూడా పూజాలా క్షమాపణలు చెప్పాల్సిందేనా అంటే! అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అవకాశం ఇచ్చి అందళమెక్కిస్తే, ఇప్పుడు ఏకంగా తలనే తన్నేస్తున్నారు కొందరు హీరోయిన్స్. అలాంటి వారిలో అప్పట్లో తాప్సీ, పూజా హెగ్డేలు హాట్ టాపిక్‌గా నిలిస్తే, ఇప్పుడు అడల్ట్ సినిమాలు చేసిన రాధిక ఆప్టే వార్తల్లో నిలిచింది. నందమూరి అభిమానులు ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్‌కి ఏకిపారేస్తున్నారు.

'అక్క' సిరీస్ గురించి కదా మాట్లాడాల్సింది:

ఇటీవల బాలీవుడ్‌లో రూపొందిన పీరియాడిక్ వెబ్ సిరీస్ 'అక్క'. కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఎప్పుడో స్ట్రీమింగ్ కావాల్సిన 'అక్క' పలు కారణాల వల్ల ఆలస్యం అయి..ఇటీవలే దిగ్గజ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన 'అక్క' డిసప్పాయింట్ చేసింది. కీర్తి సురేష్ గెటప్..ఆమె పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ, కంటెంట్ పరంగా మాత్రం ప్రేక్షకాధరణ కరువైంది.

అయితే, ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి ముందు జోరుగా ప్రమోషన్స్ నిర్వహించింది ప్రొడక్షన్ టీమ్. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా కీర్తి సురేష్‌తో కలిసి పలు ఇంటర్వ్త్యూస్ ఇచ్చిన రాధిక...బాలకృష్ణ పేరు తీయకుండానే లెజెండ్ సినిమాలో తన పాత్ర గురించి..సినిమా గురించి..హీరో గురించి కాంట్రవర్సీగా మాట్లాడింది. ఇదే, రాధికను ఇప్పుడు విమర్శలకి గురి చేస్తోంది. ఎప్పుడో వచ్చిన సినిమాకి 'అక్క' వెబ్ సిరీస్‌కి అసలు సంబంధం లేదు.

కానీ, ఇప్పుడు ఆ సినిమా గురించి, అందులో సన్నివేశాల గురించి హీరో గురించి లేవనెత్తడం పెద్ద పొరపాటని సోషల్ మీడియాలో రాధికను ఏకిపారేస్తున్నారు. పక్కన కీర్తి సురేష్ ఉన్నా కూడా కనీసం ఆమె వారించలేదు సరి కదా..అవునన్నట్టుగా తలూపుతూ కూర్చుంది. దీంతో, నందమూరి అభిమానులు నెట్టింట కామెంట్ల రూపంలో రాధికను గట్టిగా దులిపేస్తున్నారు.

అప్పట్లో, పూజా హెగ్డే కూడా తెలుగు వాళ్ళను చులకనగా, చొంగకార్చుకునేవాళ్ళలాగా మాట్లాడింది. రాఘవేంద్రరావు గురించి తాప్సీ మాట్లాడిన మాటలు కొన్నాళ్ళు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ సమయంలో వాళ్ళు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు, రాధికా ఆప్టే కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పల్సిందే అంటున్నారు. మరి, ఈ వ్యవహారం ఎక్కడికి చేరుకుంటుందో.

#Radhika Apte#Pooja Hegde#Tapsee#Tollywood#Viral News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి