స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

TG : అమ్మిన భూమినే మళ్లీ అమ్మి కోర్టు ధిక్కరణ అంటూ హల్‌చల్?

7 నిమిషాల పఠనం

బాచుపల్లిలోని సర్వే నెంబర్ 140లో హైకోర్టు సీసీ నెం.522/2025 కేసులో సబ్ రిజిస్ట్రార్‌కు రిజిస్ట్రేషన్ చేయవద్దు అని చెప్పినా ఎందుకు చేస్తున్నారు. అందుకు ఆ సబ్ రిజిస్ట్రార్‌కు 6 నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల పైన్ అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలా రోజుకు ప్రైవేట్ భూముల్లో లేదా కేసుల్లో రోజుకు వివిధ జిల్లాల కేసుల్లో 10కి తక్కువ కాకుండా ఆర్డర్స్ వస్తూన్నా ఉన్నాయి.

-ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్చలేవి?

-ఏదో ప్రత్రం పేరుతో ఆంధ్రా దొంగల ముఠా బరితెగింపు?

-తెలంగాణలో ఆరాచకాలు కొనసాగింపు?

- టైటిల్‌పై స్పష్టత ఉండదు.. సుప్రీం తీర్పుతో రిజిస్ట్రేషన్స్?

- సంబంధం లేకుండానే కోర్టు కంటెప్ట్ అంటూ చంకలు గుద్దుకుంటున్న తీరు?

- లెక్కా పత్రం లేని భూమి పేరుతో రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుని అగ్రిమెంట్లు

- ఉనికిని కాపాడుకునేందుకు చిన్న కంటెప్ట్ ఆర్డర్‌తో స్వీట్ల పంపిణీ?

- ఈ ఆంధ్రా ఉత్సాహం సీలింగ్ ల్యాండ్స్‌పై రిజిస్ట్రేషన్స్‌పై ఉండాలి?

- బాచుపల్లి భూముల్లో కోర్టు తీర్పు ఏంటి?

- జరిగింది ఏంటో స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేషన్ కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

కోర్టు కంటెప్ట్‌తో కలెక్షన్స్ కింగ్ కవరింగ్?

బాచుపల్లిలోని సర్వే నెంబర్ 140లో హైకోర్టు సీసీ నెం.522/2025 కేసులో సబ్ రిజిస్ట్రార్‌కు రిజిస్ట్రేషన్ చేయవద్దు అని చెప్పినా ఎందుకు చేస్తున్నారు. అందుకు ఆ సబ్ రిజిస్ట్రార్‌కు 6 నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల పైన్ అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలా రోజుకు ప్రైవేట్ భూముల్లో లేదా కేసుల్లో రోజుకు వివిధ జిల్లాల కేసుల్లో 10కి తక్కువ కాకుండా ఆర్డర్స్ వస్తూన్నా ఉన్నాయి. గత సీఎస్ సోమేశ్ కుమార్‌పై 280కి పైగా ఇలాంటి ఆర్డర్స్ కేసులు ఉండేవి. రంగనాథ్‌పై 100కి పైగానే ఉన్నాయి. ఇలా అన్ని వ్యవస్థలపై కోర్టు ధిక్కరణ కేసులు కామన్. అప్పీల్‌లో ఎందుకు చేయలేకపోయామో వివరిస్తే కొట్టి వేస్తారు. జైలుకు వెళ్లిన సందర్భాలు అస్సులు కనిపించవు. కానీ, అధికారులు సరిగ్గా పని చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉంటాయి.

ఇలాంటి కేసుల్లో ఆంధ్రా భూ మాఫియా సభ్యుడు తనకు టైటిల్ ఉందని, తన భూమి దామోదర్ రావు కబ్జా చేశాడని పార్టీషన్ సూట్‌లో వాళ్ల ఫ్యామిలీ వేసుకున్న కేసును పట్టుకుని పట్నం మొత్తం తిరుగుతున్నాడు. లీగల్‌గా అంతా నిజమే అన్నట్లుగా నమ్మిస్తున్నాడు. 10 లక్షలు ఇస్తే బాచుపల్లిలో 10 ఎకరాలు అగ్రిమెంట్ చేస్తానంటున్నాడు. గుడివాడ నుంచి జిరాక్స్ పత్రాలు పంపించి గత 15 ఏండ్లుగా 20 కోట్లుకు పైగా మోసాలకు పాల్పడ్డారు. లిటిగేషన్ ల్యాండ్‌ను సెటిల్మెంట్ చేసుకుంటా అని 2014లోనే నయీం గ్యాంగ్‌తో బెదిరించి కోట్లు తీసుకుని పరారు అయ్యారని ఆధారాలు ఉన్నాయి. ఇలా ఎవరు కనిపించినా ఆ సర్వే నెంబర్‌పై లేని భూమిని చూపించి, జిల్లా రిజిస్ట్రార్ సేల్ డీడ్ చేసిన డ్యాకుమెంట్‌ను చూపించి అందరినీ ఆంధ్రా నాయకుడు ఆగం పట్టిస్తున్నాడు.

కోర్టు ధిక్కరణ టైటిల్ డిసైడ్ చేస్తుందా?

అన్నింటిని ఒకేతాటిపై కట్టి బ్లాక్ మెయిల్ చేసే గ్యాంగులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్‌తో ఎక్స్ పార్టీ ఆర్డర్ ఉందనే నెపంతో కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్‌, సబ్ రిజిస్ట్రార్‌పై కోర్టు కంటెంప్ట్ కేసులు వేశారు. రిట్ అప్పీల్ 754/2022పై ఆర్డర్‌ను ఫాలో కావడం లేదని కోర్టు ధిక్కరణపై 2025లో వేశారు. చలసాని కళ్యాణి లీలా వేసిన కేసుల్లో ఏడీఆర్‌గా పిలిచే దామోదర్ రావు ఓ ఎమ్మెల్సీ మామకు శిక్ష పడిందని అంటూ కుత్బుల్లాపూర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్వీట్లు పంచారు. అదే గ్రామంలో సీలింగ్ ల్యాండ్‌ను,ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన ఇదే గ్యాంగ్‌కు సబ్ రిజిస్ట్రార్ ఈనాటికి ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారని ఏ ఒక్కరూ కేసు వేయడం లేదు. ఏదో ఒక పేరుతో డబ్బులు దండుకునే బ్యాచ్‌లు రోజు రోజుకు భూములపై కేసులు గెలిచామని దోచుకుంటున్నాయి. భూమి ఏదైనా టైటిల్, కేసుల్లో ఆనాడు, ఈనాడు ఎవరు గెలిచారో చూసుకుని పెట్టుబడులు పెట్టాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం.

గుడివాడ గ్యాంగ్‌పై పోలీసులు దృష్టి పెట్టరా?

ఆనాటి నయీం నుంచి ఈనాటి సీఎం బ్రదర్స్‌తో పాటు రెవెన్యూ మినిస్టర్ వరకు ఫైల్ తీసుకుని అందరినీ కలిసి వచ్చారని టాక్. కింది స్థాయిలో వందల మందిని మోసం చేసి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎంతోమంది వద్ద అడ్వాన్సులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అట్లూరి సుబ్బారావుని మించిన అడ్వాన్స్ దారుడిని మార్కెట్‌లో ఎవరినీ చూడలేదనే టాక్ నడుస్తోంది.

#Land resale Case#Hyderabad#court contempts#illegal Registrations#Telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి