Vishwambara: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
మెగాస్టార్‌ను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో చూపించనున్నారనే ప్రచారంతో ఫస్ట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే వచ్చిన కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే 2025 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడింది. అనంతరం 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే వార్తలు వినిపించినా అది కూడా జరగలేదు. ప్రస్తుతం చిరంజీవి తన కొత్త మూవీ ‘కాకా’ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు వశిష్ఠ కూడా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో ‘విశ్వంభర’ కంటే హీరో, డైరెక్టర్ ఇద్దరూ తమ తదుపరి సినిమాలపై ఫోకస్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో ‘విశ్వంభర’ను అక్టోబర్ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పటివరకు చిత్రబృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడటంతో.. అసలు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే ప్రశ్నకు సమాధానం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సరైన రిలీజ్ డేట్ ఎప్పుడు లాక్ చేస్తారన్నదే ఇప్పుడు అసలు ఆసక్తిగా మారింది.








