Tollywood: అసలు ఏ ఒక్కరు ఊహించని కాంబో తాజాగా ప్రకటించారు. ఆ కాంబో ఎన్టీఆర్ - అనిల్ రావిపూడిలది. ఈ సినిమా కన్‌ఫర్మ్ చేస్తూ స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించడం విశేషం. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉండబోతుందని గత కొన్ని గంటల క్రితమే వార్త వచ్చి వైరల్ అయింది. ఇది, కనీసం పవన్ అభిమానులు ఆనందపడేలోపే తారక్ బిగ్ షాకిచ్చాడు. నెక్స్ట్ సినిమాను హిట్ మిషన్ అనిల్ రావిపూడితో చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు, టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. నందమూరి కళ్యాణ్‌రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించనుండగా, దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం కానున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కాంబోను ఊహించని వాళ్ళకి స్వీట్ షాక్ అని చెప్పాలి.
ఎన్టీఆర్-అనిల్ రావిపూడి కాంబో ఎలా సెట్ అయిందంటే:
అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్-కళ్యాణ్‌రామ్ హీరోలుగా 'జనవరి 12 విడుదల' అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాంబోతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో కళ్యాణ్‌రామ్ కి అనిల్ రావిపూడి తారక్ కోసం తయారు చేసిన కథను చెప్పగా, అది నచ్చి..వెంటనే ఎన్టీఆర్ కి చెప్పించాడట. ఈ కథ ఎన్టీఆర్ కి విపరీతంగా నచ్చడం..2028 సంక్రాంతి బరిలో రిలీజ్ ప్లాన్ చెప్పడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్.
ఇక, ఎప్పటిలాగే 2027 సెకండాఫ్ నుంచి ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌పైకి తేనున్నాడు అనిల్ రావిపూడి. మొత్తానికి, ఊహించని కాంబోలో సినిమా ప్రకటన రావడం ఇండస్ట్రీ వర్గాలలోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన 'గాడ్ ఆఫ్ వార్' ఈ ఏడాదికి ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడు. అక్కడ, నాగ వంశీ కూడా ఎన్టీఆర్ కి బాగా క్లోజ్. మరి, రెండు సినిమాలను ఒకేసారి చేస్తాడా..ముందు అనిల్ సినిమా పూర్తి చేసి.. ఆ తర్వాత గురూజీ సినిమాను లైన్‌లో పెడతాడా అనేది కొన్నాళ్ళు ఆగితేగానీ తెలియదు.


