తెలంగాణ

TG : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. సీడబ్ల్యూసీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు,పార్టీ పరమైన పలు అంశాలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం.రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు,పార్టీ పరమైన పలు అంశాలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం.రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ టూర్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.

ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి సీఎం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అందులో రాష్ట్ర, పలు జాతీయ రాజకీయ అంశాలపై చర్చ జరగనునున్నట్టు సమాచారం.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై పోరాటం, అలాగే పలు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.ఈ భేటీలో దేశవ్యాప్తంగా ఉన్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, సీనియర్ జాతీయ నేతలు సైతం హాజరుకానున్నట్టు సమాచారం. అనంతరం తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత విషయాలపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా రాష్ట్రంలో ఖైరతాబాద్ ఉపఎన్నికలో ఎవరికి టికెట్ ఇవ్వాలి?.. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపైనా హైకమాండ్‌తో సీఎం రేవంత్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.కాగా, ఈ ఎన్నికల కోసం ఆశావహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.

#Cm revanth reddy#delhi tour#congress#CWC#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి