తెలంగాణ

కేటీఆర్‌ సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చాడు : సీఎం రేవంత్

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TG: సిరుల గడ్డగా పేరొందిన సిరిసిల్లను పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ‘ఉరిసిల్ల’గా మార్చివేశారని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సిరిసిల్ల వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో రాజకీయ దాడులు చేశారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి వేల కోట్లు వెనకేసుకున్నారే తప్ప, నేతన్నల ఆత్మహత్యలను ఆపలేకపోయారని విమర్శలు గుప్పించారు.

TG: సిరుల గడ్డగా పేరొందిన సిరిసిల్లను పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ‘ఉరిసిల్ల’గా మార్చివేశారని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సిరిసిల్ల వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో రాజకీయ దాడులు చేశారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి వేల కోట్లు వెనకేసుకున్నారే తప్ప, నేతన్నల ఆత్మహత్యలను ఆపలేకపోయారని విమర్శలు గుప్పించారు.

ఆరుసార్లు గెలిచినా ఆగని నేతన్నల ఆత్మహత్యలు

అమెరికా నుంచి దిగుమతి అయిన కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు 2009 నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని సీఎం గుర్తుచేశారు. "సిరిసిల్ల అంటే ధైర్యం, దైవం ఉన్న నేల. అలాంటి ప్రాంతాన్ని సామాజిక సమస్యలకు, కార్మికుల కన్నీళ్లకు అడ్డాగా మార్చారు. ఇక్కడి ప్రజలు వేసిన ఓట్లను పచ్చనోట్లుగా మార్చుకుని నిజాం నవాబులా ఫామ్‌హౌస్‌లు కట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆరుసార్లు గెలిపించినా నేతన్నల ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలు ఎందుకు ఆగలేదు? చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కనీసం అణాపైసా సాయం చేయని దయనీయ స్థితిలో గత ప్రభుత్వం నడిచింది" అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మానేరు ఇసుక, కాళేశ్వరంలో వేల కోట్ల దోపిడీ

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొడితే.. మానేరు ఇసుకను గుల్ల చేసి కేటీఆర్, రవీందర్ రావు, సంతోష్ రావు వేల కోట్ల అక్రమ సంపాదన కూడబెట్టారని రేవంత్ ఆరోపించారు. మానవ మాత్రులనే కాక, వేములవాడ రాజన్న, భద్రాచలం రామయ్యకు సైతం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు. గత పాలకుల పదేళ్లలో చేనేత రంగానికి రూ.2,234 కోట్లు ఖర్చు చేస్తే.. తమ రెండున్నరేళ్ల పాలనలోనే ఏకంగా రూ.1,731 కోట్లను నేతన్నల సంక్షేమానికి కేటాయించామని రేవంత్ స్పష్టం చేశారు.

సిరిసిల్ల గడీల మీద ఫిరంగులమై పేలుదాం

వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల బీఆర్‌ఎస్ గడీని బద్దలు కొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కదలాలని సీఎం పిలుపునిచ్చారు. "సిరిసిల్ల గడీలపై గురిపెట్టి ఫిరంగులమై పేలాలి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపిస్తాం. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేసిన నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాం. రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ ద్వయం రాబోయే ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తుంది" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

#Telangana#TG Politics#Revanth Reddy#KTR#KT Rama Rao#KCR#BRS#Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి