ఏపీ

AP: రాప్తాడు నిందితుడి హెల్త్ సీరియస్.. కర్నూల్‌కి షిఫ్ట్ చేసిన డాక్టర్స్!

3 నిమిషాల పఠనం

AP: రాప్తాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో అమానుష దాడికి పాల్పడి సంచలనం సృష్టించిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లు షిఫ్ట్ చేశారు.

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో విషమించిన పరిస్థితి

గత 13 రోజులుగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్‌కు 'పల్మనరీ ఎంబాలిజం' (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదకర పరిస్థితి) తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. మూడు రోజుల క్రితమే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో అతడు ఆసుపత్రి మంచంపై నుంచి కింద పడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నప్పటికీ, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళాల్లో గడ్డకట్టడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిందితుడికి అత్యవసర, మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ల సూచన మేరకు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య హేమంత్‌ను కర్నూలుకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

#Andhra Pradesh#AP News#Raptadu#Hemanth#Anantapur#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి