తెలంగాణ

10రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి-మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

5 నిమిషాల పఠనం

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచించారు.

Komatireddy Venkat Reddy: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఎక్కడా జాప్యం జరగకుండా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. రైతన్నలకు అండగా నిలవడమే మా లక్ష్యం అన్నారు మంత్రి కోమటిరెడ్డి. అలాగే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి. ఈ సమీక్షలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం నల్గొండ జిల్లాలో ఉత్పత్తి అయినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు

మరోవైపు రైతులెవరూ తొందరపడి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారాయన. మరోవైపు కొత్త చేయూత పెన్షన్ల లబ్దిదారులకు మంజూరు ఉత్వర్వులు అందజేశారు. గత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ త్వరలోనే చేయూత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అందిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

''నల్గొండలో నూతన 'చేయూత' పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశాం. అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఈ పింఛన్లను మంజూరు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపు 27 వేల మందికి, నల్గొండ నియోజకవర్గంలో 8,500 మందికి పైగా నూతన పింఛన్లతో లబ్ధి చేకూరనుంది. పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అండగా నిలుస్తాయి. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం'' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

#Komatireddy Venkat Reddy#Paddy Procurement#Nalgonda#Telangana#Farmers#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి