సినిమా

Ramayana: సీత పాత్ర విషయంలో సాయి పల్లవికి స్టార్స్ సపోర్ట్..

4 నిమిషాల పఠనం

Ramayana: సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు దక్కడం, చేయడం ఎంత అదృష్టమో.. వాటిని ప్రేక్షకులు అంగీకరించేలా నటించడం అంతకంటే పెద్ద కష్టం. ముఖ్యంగా, రామాయణం లాంటి ఇతిహాసంలో సీత పాత్ర పోషించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన అవకాశం సాయి పల్లవికి దక్కింది. అయితే, రామాయణలో సీతగా ఆమె ఎంపికైనప్పటి నుంచి కొందరు అదేపనిగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆమె లుక్స్, రూపం, కాస్ట్యూంస్ పరంగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

Ramayana: సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు దక్కడం, చేయడం ఎంత అదృష్టమో.. వాటిని ప్రేక్షకులు అంగీకరించేలా నటించడం అంతకంటే పెద్ద కష్టం. ముఖ్యంగా, రామాయణం లాంటి ఇతిహాసంలో సీత పాత్ర పోషించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన అవకాశం సాయి పల్లవికి దక్కింది. అయితే, రామాయణలో సీతగా ఆమె ఎంపికైనప్పటి నుంచి కొందరు అదేపనిగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆమె లుక్స్, రూపం, కాస్ట్యూంస్ పరంగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కానీ, సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి మారుతోంది. సాయి పల్లవికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు, మద్దతు దక్కుతోంది.

సాయి పల్లవికి ధనుష్ అండదండలు:

సాయి పల్లవి సీత పాత్ర విషయంలో తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దేశం మొత్తం వెతికినా సీత పాత్రకు సాయి పల్లవి కంటే న్యాయం చేసే నటి దొరకడం కష్టమని ఆయన ప్రశంసించారు. షూటింగ్ సమయంలో విరామం దొరికినా ఆమె ప్రార్థన చేస్తూ ఉండేదని, ఆ పాత్ర పట్ల ఎంతో భక్తి, అంకితభావం చూపించిందని ధనుష్ వెల్లడించారు.

సాయి పల్లవి గొప్ప నటి అని, సీత పాత్రలో ఆమె అందంగా, సహజంగా కనిపించిందని ధనుష్ ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆమె ఎంపికపై విమర్శలు చేసిన వారికి ఈ వ్యాఖ్యలు గట్టి సమాధానం అని చెప్పాలి. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణలో సాయి పల్లవి సీతగా నటిస్తుందని ప్రకటించినప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియా రూపంతో కొందరు ఆమెను పోల్చారు. అయితే పాత్రకు సంబంధించిన ప్రమోషనల్ వీడియో విడుదలైన తర్వాత సాయి పల్లవి లుక్‌పై ప్రశంసలు పెరిగాయి. సినిమా రిలీజైయ్యాక..ఆదరణ ఇంకా పెరిగింది.

దర్శక ధీరుడు రాజమౌళి, కరణ్ జోహార్ ప్రశంసలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా రామాయణ సినిమాను ప్రశంసించారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా చక్కగా నటించారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, సీత పాత్రలో సాయి పల్లవి చూపించిన హుందాతనాన్ని ప్రస్తావించారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపించారు. ఆమె సీత పాత్రలో దైవత్వం, ప్రశాంతత కనిపించాయని పేర్కొన్నారు. ఇక రాపర్ బాద్షా సైతం సాయి పల్లవి నటనను ప్రత్యేకంగా అభినందించడం గొప్ప విశేషం.

#Ramayana#Sai Pallavi#Nithish Thiwari#RanBeerKapoor#Dhanush#Yash
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి