తెలంగాణ

Chiranjeevi : కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి కీలక భేటీ..

4 నిమిషాల పఠనం

మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తాజాగా సమావేశం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి భేటీ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది.ఏపీలో బీజేపీతో చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తాజాగా సమావేశం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి భేటీ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది.ఏపీలో బీజేపీతో చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలుపుకోసం బీజేపీ పార్టీ మెగాస్టార్ చిరంజీవి సాయం కోరనుందా? అనే చర్చ మొదలైంది. ఇటీవల చిరంజీవి,ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.

గతంలో ప్రధాని మోడీతో చిరంజీవి సమావేశం కావడంతో ఆయన తిరిగి పాలిటిక్స్‌లోకి వస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి.. అనంతరం కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే, కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలను చిరంజీవి కలుస్తుండటం వెనుక ఏదో కీలకమైన అంశం దాగుందని ప్రచారం జరుగుతోంది.

కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడం వెనుక గల కారణాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ ఇంపర్సనేషన్ వంటి సమస్యల నుంచి సినీ కళాకారులు, కార్మికులు, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ విషయాన్ని చిరు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ అనంతరం ఆయన సూచనల మేరకు.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేసినట్లు పోస్టుపెట్టారు.

చిరంజీవి అందజేసిన వినతిపత్రంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో చిరంజీవి కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పౌరుడి భద్రతతో పాటు కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటం అందరి ఉమ్మడి బాధ్యత అని చిరంజీవి పేర్కొన్నారు. "సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలే తప్ప, ఆత్మగౌరవాన్ని నాశనం చేయకూడదు" అని అభిప్రాయపడ్డారు.

#megastar chiranjeevi#central minister kishan reddy#request letter#digital abuse#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి