తెలంగాణ

Hyderabad : గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల సేకరణ..

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న చీకటి కోణాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడి యువతులను డబ్బు ఆశ చూపించి వారి నుంచి రహస్యంగా అండాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. అనంతరం వాటిని సంతాన సాఫల్య కేంద్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న చీకటి కోణాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడి యువతులను డబ్బు ఆశ చూపించి వారి నుంచి రహస్యంగా అండాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. అనంతరం వాటిని సంతాన సాఫల్య కేంద్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు బేగంపేట పరిధిలోని ప్రకాశ్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. నగరంలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. ఏడాది నుంచి హాస్టల్‌ ముసుగులో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.కొందరు నిర్వాహకులు ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి నుంచి అండాలు సేకరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయినట్టు తెలిసింది.

సేకరించిన అండాలను సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పురుషుల నుంచి వీర్యకణాలు కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. బిహార్‌, యూపీ, ఒడిశాకు చెందిన 10 మంది యువతులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్‌లో లభించిన ఆధారాల మేరకు పోలీసుల విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

ఆర్థికంగా వెనుకబడిన, వెనుకా ముందు ఎవరూ లేని యువతలకు ఎర వేసి వారిని ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి గుట్టుగా అండాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని సంతానసాఫల్య కేంద్రాలకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. సంతాన సాఫల్య కేంద్రాలకు సైతం ఇందులో భాగస్వామ్యం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతవరకు ఎంత మంది యువతుల నుంచి అండాలు సేకరించారు? ఏయే సాఫల్య కేంద్రాలకు విక్రయించారని పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#guise of a girls#procuring#hyderabad#telangana#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి