చిన్నచిన్నవివాదాలకే కొందరు సహనం కోల్పోయి హత్యలు చేస్తున్నారు.ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా చేస్తున్న పనుల వలన అటు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, మర్డర్ చేసిన వ్యక్తికి చెందిన కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చేస్తున్నాయి. తాజాగా పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కాస్త ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ సెక్టార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. ఫరీదాబాద్ సెక్టార్ 21సీలో కారు పార్కింగ్ వివాదం కారణంగా పొరుగింటి వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో పరంజీత్ ధన్‌ఖడ్ (42) అనే ఎన్నారై దారుణ హత్యకు గురయ్యారు. సింగపూర్‌లో నివసిస్తున్న టెక్ మహీంద్రా మాజీ ఉన్నతోద్యోగి పరంజీత్.. తన మేనల్లుడి వివాహం కోసం భారత్‌కు వచ్చాడు. తాను నివసించే అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో గొడవ కాస్త అతని హత్యకు దారితీయడంతో అంతా షాక్‌కు గురయ్యారు.
అయితే, సింగపూర్‌లో పనిచేస్తున్న పరంజీత్ ధన్‌ఖడ్ ఫరీదాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు.అదే భవనం మూడో అంతస్తులో మోహన్ (మోనూ) శర్మ ఉంటున్నాడు.తనకు కేటాయించిన స్థలంలో కారు పార్కింగ్ చేసిన విషయంపై పరంజీత్, మోనూ శర్మ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.గతంలోనూ వీరిద్దరి మధ్య పార్కింగ్ సహా ఇతర చిన్న విషయాలపై తరచూ గొడవలు జరిగేవని సమాచారం.
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో మోనూ శర్మ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో ‘హ్యాపీ దీపావళి..అందరినీ చంపేస్తా’ అని గట్టిగా అరుస్తూ పరంజీత్‌పై సుమారు 15 నుంచి 16 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలిసింది. దీంతో ఏడు బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో పరంజీత్ చనిపోయాడు. పరంజీత్ కుమారుడి కళ్లముందే మోనూ శర్మ కాల్పులు జరిపాడు.గన్ కాల్పులు విని మృతుడి కుమారుడు వెంటనే పరుగులు తీశాడు. పరంజీత్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా వెంటబడి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


