తెలంగాణ

TG police : పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్త

4 నిమిషాల పఠనం

తెలంగాణ పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్త చెప్పినట్టు తెలుస్తోంది. గతకొన్నేళ్లుగా పెండింగులో ఉన్న పోస్టులు, ప్రమోషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పోలీసు శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధికారుల పదోన్నతుల ప్రాసెస్ మీద డీజీపీ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.

తెలంగాణ పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్త చెప్పినట్టు తెలుస్తోంది. గతకొన్నేళ్లుగా పెండింగులో ఉన్న పోస్టులు, ప్రమోషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పోలీసు శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధికారుల పదోన్నతుల ప్రాసెస్ మీద డీజీపీ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. దీనిలో భాగంగానే పోలీస్ శాఖలో వివిధ స్థాయిల్లో అధికారుల పదోన్నతులకు సంబంధించి కీలక అంశాలపై ఇవాళ తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో అర్హులైన పోలీసు అధికారుల సర్వీస్ రికార్డులు, అర్హతలు, ఖాళీల వివరాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల దస్త్రాలు, కోర్టు కేసుల క్లియరెన్స్ పదవులు, త్వరలో పదవీ విరమణ చేయనున్న అధికారుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేయాల్సిన ఖాళీలపై ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టారు.

పోలీసుశాఖలో ప్రమోషన్లు లేక నిరుత్సాహంలో ఉన్నవారిని తిరిగి యాక్టివ్ చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వెలువడిన మార్గదర్శకాలకు అనుగుణంగా డీజీపీ సీవీ ఆనంద్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

ఈ సమావేశంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది పాల్గొని అర్హులైన అధికారుల జాబితాను సిద్ధం చేసి దానిపై చర్చించనున్నారు.ఈ భేటీ అనంతరం పదోన్నతులకు సంబంధించి కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.కాగా, పోలీసుశాఖలో పదోన్నతుల అంశం చర్చకు రావడంతో చాలా మంది ప్రమోషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్టు తెలిసింది.

#Telangana#police department#goodnews#police officers#promotions#DGP CV anand
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి