తెలంగాణ

ACB : నాగర్ కర్నూల్ ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

4 నిమిషాల పఠనం

తెలంగాణలో మరోసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో నాగర్‌కర్నూల్ నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

తెలంగాణలో మరోసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో నాగర్‌కర్నూల్ నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌ మహానగరంతో పాటునాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కలిపి మొత్తం 10 చోట్ల ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టాయి.

డీఈఈ సత్యనారాయణ తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ..ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు, స్థిర, చరాస్తుల పత్రాలు, బ్యాంక్ లాకర్లు, నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో దొరికిన పత్రాల ఆధరంగా రూ.కోట్లలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ప్రచారం జరుగుతోంది. సాయంత్రానికి లేదా రేపు ఉదయానిల్లా ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించున్నట్టు తెలుస్తోంది.

ఏసీబీకి చిక్కిన అధికారులు..

ఇటీవలి కాలంలో లంచం డిమాండ్ చేసి ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన అధికారుల జాబితా చాలా పెద్దదిగానే ఉంది.ముందుగా కీసర ఎస్ఐ కొండారెడ్డి శ్రీనివాస్.. రెండు క్రిమినల్ కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ నవంబర్ 9న ఏసీబీకి పట్టబడ్డాడు. ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది దీపావళి పండుగ నాడు బాణసంచా దుకాణాల లైసెన్సుల జారీలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రుసుం కంటే ఎక్కువగా యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది.

మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్ రెడ్డి పెండింగ్ క్యాటరింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం రూ. 1లక్ష లంచం తీసుకుంటూ సమాచారం. మెప్మా అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవంబర్ 3-4 తేదీల్లో ఏసీబీ నిర్వహించిన సోదాలు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు అక్రమార్జన చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. వారిలో కొందరు ఏసీబీ చెరలో ఉండగా, మరికొందరు తప్పించుకుని బయట తిరుగుతున్నారని టాక్ నడుస్తోంది.

#nagar kurnool#irrigation dEE#bribecase#raids in hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి