స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

బాచుపల్లిలో 50 ఎకరాల 'నిమ్మగడ్డ' భూముల వివాదం

రచన: Swechaanews Chairman•••6 నిమిషాల పఠనం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి గ్రామంలో శ్రీ నిమ్మగడ్డ శ్రీరామనాథంకు చెందిన దాదాపు 50 ఎకరాల విలువైన భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలుగా ఉన్న రిజిస్టర్డ్ రికార్డులు, రెవెన్యూ ఆధారాలు ఒకవైపు ఉంటే.. దొంగచాటుగా వెలిసిన పలు అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, జీపీఏల ఆధారంగా జరుగుతున్న ఆక్రమణలపై భూ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • 1966 నాటి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, జీపీఏ ఆధారాలు

  • డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐడీపీఎల్ సంస్థలకు భూముల విక్రయం

  • సమాంతరంగా వెలుగులోకి వచ్చిన అన్ రిజిస్ట్రర్డ్ డీడ్‌లు

  • మేడ్చల్ కోర్టులో సివిల్ కేసులు

  • పాత జీపీఏ హోల్డర్ అట్లూరి సుబ్బారావుపై కోట్ల రూపాయల అక్రమ వసూళ్ల ఆరోపణలు

  • సీఐడీ విచారణకు బాధితుల డిమాండ్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి గ్రామంలో నిమ్మగడ్డ శ్రీరామనాథంకు చెందిన దాదాపు 50 ఎకరాల విలువైన భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలుగా ఉన్న రిజిస్టర్డ్ రికార్డులు, రెవెన్యూ ఆధారాలు ఒకవైపు ఉంటే.. దొంగచాటుగా వెలిసిన పలు అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, జీపీఏల ఆధారంగా జరుగుతున్న ఆక్రమణలపై భూ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ భూ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చేందుకు సీఐడీ లేదా ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

చట్టబద్ధమైన రికార్డులు & ప్రముఖ సంస్థలకు విక్రయాలు

రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖల పత్రాల ప్రకారం.. 1966లో బాచుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 45, 50, 83, 335, 336 లలో మొత్తం 50 ఎకరాల భూమిని నిమ్మగడ్డ శ్రీరామనాథం కొనుగోలు చేశారు (డాక్యుమెంట్ నంబర్: 157/1966). అనంతరం తన తరఫున వ్యవహరించేందుకు అట్లూరి సుబ్బారావుకు 1983లో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) ఇచ్చారు. అలాగే 1991లో నిమ్మగడ్డ పూర్ణచంద్రరావు, సాయిబాబులతో కలిసి సుబ్బారావుకు మరో జీపీఏ పత్రం జారీ చేశారు. దీని ఆధారంగానే 1992-1994 మధ్య కాలంలో సర్వే నంబర్లు 45, 50, 83 లోని భూములను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (Dr. Reddy's Laboratories), ఐడీపీఎల్ (IDPL) తదితర ప్రముఖ సంస్థలకు చట్టబద్ధంగా విక్రయించారు. 1989-90 ROR రికార్డులు, 1995-96 పహాణీలలోనూ ఈ భూములు నిమ్మగడ్డ శ్రీరామనాథం పేరునే ఉన్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి.

వెలుగులోకి నకిలీ, అన్ రిజిస్ట్రర్డ్ పత్రాలు

ఈ చట్టబద్ధమైన లావాదేవీలకు సమాంతరంగా సృష్టించిన పలు అన్‌రిజిస్ట్రర్డ్ పత్రాలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. 1987లో చిత్తూరి లక్ష్మీనారాయణకు, 1991లో కాసాని జ్ఞానేశ్వర్‌కు 50ఎకరాలు విక్రయించినట్లు కొన్ని అన్‌రిజిస్టర్డ్ డీడ్‌లను తెరపైకి తెచ్చారు. ఈ విక్రయాలపై ప్రస్తుతం మేడ్చల్ న్యాయస్థానంలో ఓఎస్ నంబర్ 56/2022 (O.S. No. 56 of 2022) కింద సివిల్ కేసులు విచారణలో ఉన్నాయి. వీటికి తోడు 1992 అక్టోబర్‌లో ఎన్‌వీ రామరాజుకు కూడా భూములు అమ్మినట్లు మరొక అన్‌రిజిస్ట్రర్డ్ పత్రం వెలుగులోకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా ఉండగా, గతంలో జీపీఏ హోల్డర్‌గా వ్యవహరించిన అట్లూరి సుబ్బారావు తీరుపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నప్పటికీ, సదరు భూములు ఇప్పటికీ తనవేనంటూ నమ్మబలుకుతూ పలువురు అమాయక వ్యక్తులతో కొత్తగా అక్రమ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారని, వారి నుంచి రూ.కోట్లలో అడ్వాన్సులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ నకిలీ పత్రాల దందాను అడ్డుకుని, బాధిత కొనుగోలుదారులకు న్యాయం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

#BachupallyLandScam#NimmagaddaLandDispute#MedchalMalkajgiriNews#AtluriSubbaRaoGPA#BachupallyRealEstateDispute#TelanganaNewsTelugu#HydNewsTelugu#CrimeNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి