ఏపీ

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ భావోద్వేగం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులపై జరిగిన ఘోర దాడి సంఘటనపై ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ దారుణ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఒక తండ్రిగా ఈ వార్త విన్నప్పుడు తన మనసు ఎంతో గాయపడిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులపై జరిగిన ఘోర దాడి సంఘటనపై ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ దారుణ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఒక తండ్రిగా ఈ వార్త విన్నప్పుడు తన మనసు ఎంతో గాయపడిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

 ఈ దాడి సమయంలో తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మరో చిన్నారి సాహసాన్ని మనోజ్ ప్రత్యేకంగా కొనియాడారు. స్నేహితురాలి ప్రాణాలను రక్షించేందుకు ఆ బాలిక చూపిన అసాధారణ ధైర్యం ఎంతో అభినందనీయమని, ఆ చిన్నారికి ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, గౌరవం లభించాలని ఆయన ఆకాంక్షించారు. బాధితులకు ప్రాణాపాయ స్థితిలో అత్య అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 బాధితులను వేగంగా తరలించడానికి 'గ్రీన్‌ కారిడార్‌' ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం, పోలీసు శాఖ, వైద్య బృందాల సమన్వయాన్ని మనోజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ దారుణ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన తోటి విద్యార్థుల కోసం విద్యాశాఖ, ప్రభుత్వం 20మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేవలం విద్యార్థులకే కాకుండా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బాధిత కుటుంబాలకు కూడా నిరంతర మానసిక కౌన్సెలింగ్, సహకారం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 సమాజంలో మహిళలను కేవలం వస్తువులుగా చూడటం, సరదా పేరుతో కించపరచడం వంటి విపరీత ధోరణులే చివరికి ఇలాంటి ప్రమాదకర ఆలోచనలకు, హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయని మనోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై వేధింపులు, హింసకు పాల్పడే మృగాలపై కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల గౌరవం అనేది ప్రతి ఇంట్లోని చిన్నతనం నుంచే మొదలవ్వాలని, పిల్లలు పెద్దల ప్రవర్తనను చూసే నేర్చుకుంటారని ఆయన గుర్తుచేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే మహిళలకు, ఆడపిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్మించగలమని ఆయన పిలుపునిచ్చారు.

#ManchuManojEmotionalPost#RaptaduIncident2026#AnantapurSchoolGirlsAttack#APNewsTelugu#ManchuManojInstagram#EntertainmentNewsTelugu#CrimeAgainstWomen#APHomeDepartment
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి