తెలంగాణ

CM Revanth : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్

4 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజులుగా ఆయన అక్కడే పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. నిన్న దీపావళి పండుగతో పాటు సీఎం పుట్టిన రోజు కావడంతో నియోజకవర్గంలో సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటాయి.

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజులుగా ఆయన అక్కడే పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. నిన్న దీపావళి పండుగతో పాటు సీఎం పుట్టిన రోజు కావడంతో నియోజకవర్గంలో సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటాయి. నేటితో సీఎం రేవంత్ కొడంగల్ పర్యటన ముగియనుంది. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా సీఎం పలు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.

చివరి రోజు పర్యటనలో భాగంగా పారిశ్రామిక రంగ విస్తరణ, రవాణా మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా చేపడుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. లగచర్లలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమకు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. కోస్గి మండలం నాచారం వద్ద రేడియల్‌ రోడ్డు-2 పనుల ప్రారంభంలోనూ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొడంగల్‌లోని తన నివాసం నుంచి సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో హకీంపేట్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 నుంచి 5 గంటల మధ్య లగచర్లలో పారిశ్రామిక కారిడార్‌లో నిర్మించనున్న ఆయిల్‌పామ్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి నాచారం వద్ద రేడియల్‌ రోడ్డు-2 పనుల ప్రారంభానికి వెళ్తారు. అ పనులను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.

ఇదిలాఉండగా, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు దుద్యాల మండలం హకీంపేట్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. కొడంగల్‌‌లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నట్టు సమాచారం. అయితే, నియోజకవర్గ భవిష్యత్, మున్ముందు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు? వంటి అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారో అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. జెడ్‌ ప్లస్‌ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే సెక్యూరిటీని టైట్ చేశారు. వాహనాల రాకపోకల నియంత్రణ చర్యలు చేపట్టారు. సభ ముగిసిన అనంతరం రాత్రి 7 గంటలకు హకీంపేట్‌ నుంచి హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు.

#cm revanth reddy#kondangal tour#end today#development programs#inaguration#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి