తెలంగాణ

TG : ఇందిరమ్మ ప్రచారం అట్టర్ ప్లాప్.. బిల్లులు రాలేదని ఆగ్రహం

5 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు స్కీం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇస్తామని ప్రకటించిన సర్కార్.. ఆ తర్వాత జాగా ఉన్నవారికే కేటాయిస్తామని కొర్రీలు పెట్టింది.

సీఎం రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు స్కీం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇస్తామని ప్రకటించిన సర్కార్.. ఆ తర్వాత జాగా ఉన్నవారికే కేటాయిస్తామని కొర్రీలు పెట్టింది. అయితే, ఇందిరమ్మ ఇంటికి రూ.5 ఇస్తున్న ప్రభుత్వం.. అది కూడా ఒక్కసారిగా ఇవ్వడం లేదు. ముందు లబ్దిదారులు తమ సొంత పైసలతో ఇంటి నిర్మాణం ప్రారంభించాక.. విడతల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది.

ఇదిలాఉండగా, నిన్న దీపావళి పండుగ సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’పేరిట ప్రభుత్వం కొత్త ప్రచారానికి తెరలేపింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయి అందులో ఉంటున్న లబ్దిదారులతో కలిసి ప్రభుత్వం ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అయితే, సర్కారు భావించినంతగా ఈ ప్రచారం విజయవంతం కాలేదని తెలుస్తోంది. ఎందుకంటే చాలా చోట్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని మాత్రమే తుది దశకు చేరుకోగా.. మరికొన్నింటిలో మాత్రమే ప్రజలు గృహప్రవేశం చేసి ఇళ్లల్లోకి వచ్చారు.

బిల్లులు రాలేదని ప్రజాగ్రహం

ఈ క్రమంలోనే పండుగ నాడు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి విజయవంతం అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు విద్యుత్ కాంతుల నడుమ వెలుగిపోతున్న వీడియోను అటాస్ చేశారు.దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్ సెక్షల్లో కాంగ్రెస్ సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు.

రాష్ట్రంలో కరువు వల్ల ఏర్పడిన నెగెటివిటీ నుంచి బయటపడటానికి రేవంత్ ప్రభుత్వం “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” పేరు మీద కొంత హడావిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నదని విపక్ష పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం వికటించిందని, ప్రజలు తిరగబడుతున్నారని పేర్కొన్నారు. అనేక చోట్ల 3-4 ఇండ్లు మాత్రమే సిద్ధం అయ్యాయని, అవి కూడా పేదవారి ఇళ్లలా లేవని, ఇంటికి ఎలివేషన్, ఇంట్లో వాడిన మెటీరియల్ కూడా రిచ్‌గా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంటి నిర్మాణ శైలిని చూసి “అసలు వీళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఎలా ఇచ్చారు” అని ప్రశ్నిస్తున్నారు. ఇక మంత్రి షేర్ చేసిన వీడియో కింద ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమకు ఇంకా బిల్లులు రాలేదని కామెంట్లు పెడుతున్నారు. పీఆర్ ప్రచారం కోసం ప్రోగ్రాం చేస్తే, పాజిటివ్ అవడం పోయి నెగెటివ్ అయ్యిందని సైతం కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రజలకు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకుండా డబ్బా ప్రచారాలు చేస్తారా? అని బిల్లులు రాని లబ్దిదారులు ఫైర్ అవుతున్నారు.

#indiramma houses#diwali celebrations#telangana#minister ponguleti srinivas reddy#Cm revanthreddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి