ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహకు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ 27న ఆ దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికార లీకుడ్ పార్టీకి గానీ, ప్రతిపక్ష పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లోని మొత్తం 120 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం. అయితే, నెతన్యాహు నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమికి -53 స్థానాలు దక్కాయి.
నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ ఒంటరిగా 27 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ మార్క్‌ను అందుకోలేకపోయింది.ప్రతిపక్ష నేతల గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని నాలుగు పార్టీల ప్రతిపక్ష కూటమికి -48 స్థానాలు వచ్చాయి. అరబ్ పార్టీలు రికార్డు స్థాయిలో 19 స్థానాలు సాధించి కీలక శక్తిగా మారాయి. అటు అధికార పార్టీ లేదా ప్రతిపక్ష కూటమి అధికారం ఏర్పాటు చేయాలంటే అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది. అయితే, తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అరబ్ పార్టీల మద్దతు కోరబోమని నెతన్యాహు బలంగా చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్‌లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశాన్ని మాజీ సైనిక చీఫ్, ప్రతిపక్ష నేత ‘గాడి ఐసన్‌కోట్’కు కల్పించారు. 120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. కానీ అరబ్ పార్టీలు ప్రతిపక్ష నేత అయిన ఐసన్ కోట్‌కు తమ మద్దతు ప్రకటించాయి. దీంతో ఆ పార్టీ బలం (48+19) = 67కు చేరుకుంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఐసన్ కోట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు.
వీలైనంత త్వరగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కొలిక్కి తెచ్చి అధికారాన్ని చేపట్టేందుకు ఐసన్‌కోట్‌కు అధ్యక్షుడు హెర్జోగ్ 28 రోజుల గడువు విధించారు. మెజారిటీ సభ్యుల బలం ఐసన్‌కోట్ వైపు ఉండటంతో బెంజమిన్ నెతన్యాహు మరోసారి అధికారాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నెతన్యాహు సుదీర్ఘ రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికే దిశగా సాగుతున్న ఈ పరిణామాలు ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో పాటు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కాగా, ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఓవైపు అమెరికాలో జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ దారుణ ఓటమని చవిచూసింది. దీంతో ట్రంప్ దూకుడుకు కళ్లెం పడినట్టు అయ్యింది. ఇజ్రాయెల్‌లో అయితే ఏకంగా ప్రభుత్వమే మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.యుద్ధంతో విసిగిపోయిన సొంత ప్రజలే అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలకు షాక్ ఇచ్చాయి.


