ఏపీ
Ysrcp: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..జగన్ కీలక నిర్ణయం
Ysrcp: ఏపీలో త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ అధ్యక్షతన లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
