ఏపీ

వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్

Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.