రాజకీయాలు

Ys Jagan: ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులా? ఇదేనా ప్రజాస్వామ్యం.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

వైసీపీ నేతల అరెస్టులపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల అరెస్టులను ఖండించిన జగన్.. నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వాళ్లైతే వారికి సీఎం చంద్రబాబు రక్షణ కల్పిస్తూ.. బాధితులపైనే కేసులు పెట్టి రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అని చంద్రబాబును నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ మాత్రం వెనక్కి తగ్గదన్నారు. న్యాయం వైపు నిలబడి అన్యాయాన్ని నిలదీస్తుందని జగన్ తేల్చి చెప్పారు.