AP: "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే మళ్లీ మావోయిస్టులు పుడతారు".. జగన్ సంచలన వ్యాఖ్యలు!
AP: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసులు దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయం జరగనప్పుడు ప్రజల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుంటుందని హెచ్చరించిన ఆయన.. "ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసినప్పుడే సమాజంలో కాక్రోచ్లు, మావోయిస్టులు లాంటి విప్లవ పరిణామాలు పుట్టుకొస్తాయి" అంటూ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచనలం సృష్టిస్తున్నాయి.తన సొంత ఇలాకా అయిన పులివెందులలో జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనమని జగన్ నిప్పులు చెరిగారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 80 పోలింగ్ బూతులు ఉంటే, ఏకంగా 70 బూతుల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
