క్రైమ్

యూట్యూబర్ వైష్ణవి సోదరుడు సంతోష్ అరెస్ట్.. పక్కా ప్లాన్‌తోనే హరిబాబు హత్య!

 నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో సంచలనం సృష్టించిన చిత్తరి హరిబాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యూట్యూబర్ వైష్ణవి సోదరుడు, ఈ హత్య కేసు ప్రధాన నిందితుడైన గంధం సంతోష్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వైజాగ్ పారిపోయేందుకు యత్నిస్తుండగా నిజామాబాద్ బైపాస్ వద్ద రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యేక బృందాలు పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవిలది ప్రేమ వివాహం. అయితే కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపుల కారణంగా ఈఏడాది మార్చి 16న నాలుగు నెలల గర్భిణి అయిన వైష్ణవిని హరిబాబు దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి.