సినిమా
YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన
వివాదాస్పద యూట్యూబర్ రమా నందనను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. కన్సల్టెన్సీ పేరుతో సాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంపై ఆమెను అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే విచారణ సమయంలో ఆమె ఇచ్చిన సమాధానాలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కన్సల్టెన్సీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలను తన భర్త మధుకర్ మాత్రమే పర్యవేక్షిస్తారని రమా నందన చెప్పినట్లు సమాచారం. తనకు వాటితో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని పేర్కొంటూ, తాను కేవలం యూట్యూబ్ వీడియోలకే పరిమితమవుతానని వివరించినట్లు తెలుస్తోంది.
