ఏపీ
ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)
ఏపీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఉపాధ్యాయుడు అనే గౌరవం లేకుండా వెంబడించి మరీ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడులో చోటుచేసుకుంది. గుంటూరు నుంచి పెదకూరపాడుకు వెళ్తున్న ఉపాధ్యాయుడు జంపని నరేష్ బాబును కొందరు యువకులు వెంబడించి మరీ ఆపారు. అయితే, రెండు కార్లు స్వల్పంగా ఢీకొనడంతోనే ఈ వివాదం నెలకొన్నట్టు సమాచారం. గొడవ చేయొద్దని కూర్చుని మాట్లాడుకుందామని సదరు ఉపాధ్యాయుడు చెబుతున్నా..సదరు యువకులు వినకుండా కారును వెంబడించినట్టు తెలిసింది. పాఠశాల రహదారిలో ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి మరీ ఉపాధ్యాయుడిని కారులో నుంచి కిందకు లాగి దాడికి పాల్పడినట్టు సమాచారం. చేతులతో, కొబ్బరి మట్టలతో దాడికి పాల్పడినట్టు తెలిసింది.
