క్రైమ్
పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. పోలీస్ స్టేషన్లో కలకలం
Fire Self: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్లో కలకలం చెలరేగింది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
