లవ్ మ్యారేజ్‌కు సాయం చేశాడని.. యువకుడిపై కిరాతకం
ప్రేమ వివాహానికి సాయం చేశాడనే కారణంతో ఓ యువకుడిపై అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేసి దారుణంగా హతమార్చారు.ఈ ఘటన హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కార్తీక్ (40) అనే వ్యక్తి లాలాగూడలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే, నాలుగేళ్ల కిందట ఓ యువతి ప్రేమపెళ్లికి కార్తీక్ సహకారం అందించాడు. దాంతో అప్పటి నుంచి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కార్తీక్ మీద కక్షపెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పండుగ నేపథ్యంలో వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కార్తీక్‌తో యువతి తరపు బంధువుల గొడవకు దిగినట్టు సమాచారం. అది కాస్త తీవ్రతరం కావడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. యువతి సోదరులు కార్తీక్ గొంతుకోసి పరార్ అయినట్టు తెలిసింది.
