తెలంగాణ

TG : అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువతి అమెరికాలో కనిపించకుండా పోయింది. ఈ విషయం తెలిసి పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురు ఎక్కడ ఉన్నా కనిపెట్టి ఇవ్వాలని స్థానిక తెలంగాణ ప్రభుత్వాన్నివేడుకుంటున్నారు. వివరాల్లోకివెళితే.. అమెరికాలో నల్గొండ యువతి మిస్సింగ్ అయ్యింది. బోస్టన్‌లో చదువుకుంటున్న జిల్లా యువతి శ్రీజ (23) అకస్మాత్తుగా అదృశ్యం అయ్యింది. ఉన్నత చదువుల కోసం ఏడాది కిందట శ్రీజ అమెరికాకు వెళ్లినట్టు తెలిసింది. చదువుకుంటూనే అక్కడ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. నవంబర్ 2న సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన యువతి.. మరల తిరిగి తన స్టేయింగ్ రూంకు రాలేదు. ఆమె స్నేహితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని బీచ్ ప్రాంతంలో సెల్‌ఫోన్ లొకేషన్‌ను గుర్తించినట్టు సమాచారం.ఇప్పటికీ శ్రీజ ఆచూకీ లభించలేదని తెలిసింది.