ఏపీ

బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..

ఏపీలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలికను ఓ యువతి, యువకుడు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో వరుసగా క్రైమ్ ఘటనలు జరుగుతుండటం అక్కడి పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ భార్యాభర్తలు..వీరు దుకాణల్లో ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖ వచ్చి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడే ఎదురుగా ఉన్న బస్టాప్‌లో రాత్రిపూట వారి అమ్మాయి(4)తో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించారు.అయితే, అదే సమయంలో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను ఓ యువతీ,యువకుడు కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.